T20 World Cup: వామ్మో ఇదేంటి బాదుడు సామీ.. 104 మీటర్ల దూరం సిక్స్‌.. స్టేడియం దాటి పోయిన బంతి..

కాగా ఈ మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్ 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో ఒక బౌండరీ, రెండు సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఇందులో ఒక సిక్సర్‌ ఏకంగా 104 మీటర్ల దూరం వెళ్లింది.

T20 World Cup: వామ్మో ఇదేంటి బాదుడు సామీ.. 104 మీటర్ల దూరం సిక్స్‌.. స్టేడియం దాటి పోయిన బంతి..
Rovman Powell
Follow us
Basha Shek

|

Updated on: Oct 19, 2022 | 10:12 PM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ క్వాలిఫ్లయర్‌ మ్యాచ్‌లు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. కాగా ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే పరాజయం పాలైన వెస్టిండీస్‌ రెండో పోరులో జింబాబ్వేపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చేసిన కరేబియన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వేను 122 పరుగులకే ఆలౌట్‌ చేసి 31 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సూపర్‌12 ఆశలు సజీవంగా ఉంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్‌ రోవ్‌మన్‌ పావెల్ 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో ఒక బౌండరీ, రెండు సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఇందులో ఒక సిక్సర్‌ ఏకంగా 104 మీటర్ల దూరం వెళ్లింది. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా కొట్టిన ఈ సిక్స్‌ స్టేడియం అవతల పడింది. ఈ బాదుడును చూసి సహచరుడు అకేల్ హోసేన్‌ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పావెల్‌తో పాటు జాన్సన్‌ చార్లెస్‌ (45), అకీల్ హొసేన్‌ (23 నాటౌట్‌) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా (3/19), ముజరబానీ (2/38), సీన్‌ విలియమ్స్‌ (1/17) ఆకట్టుకున్నారు. అనంతరం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. పేసర్లు అల్జరీ జోసఫ్‌ (4/16), జేసన్‌ హోల్డర్‌ (3/12), ఓబెద్‌ మెక్‌కాయ్‌ (1/19), ఓడియన్‌ స్మిత్‌ (1/31) ధాటికి 18.2 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌