T20 World Cup:సెమీఫైనల్‌, ఫైనల్ గురించి ఆలోచించడం లేదు.. ఇప్పుడు మా దృష్టంతా ఇప్పుడు దాని మీదే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌

టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ ప్రయాణం అక్టోబర్‌ 23న ప్రారంభం కానుంది. ఆరోజు జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ద్వారా టీమ్ ఇండియా శుభారంభం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషమేమిటంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ తొలి ప్రపంచకప్ మ్యాచ్.

T20 World Cup:సెమీఫైనల్‌, ఫైనల్ గురించి ఆలోచించడం లేదు.. ఇప్పుడు మా దృష్టంతా ఇప్పుడు దాని మీదే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌
Rahul Dravid, Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2022 | 7:22 AM

ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ ఘనంగా ప్రారంభమైంది. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇక టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ ప్రయాణం అక్టోబర్‌ 23న ప్రారంభం కానుంది. ఆరోజు జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ద్వారా టీమ్ ఇండియా శుభారంభం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషమేమిటంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ తొలి ప్రపంచకప్ మ్యాచ్. అందుకే హిట్ మ్యాన్ కూడా తొలి మ్యాచ్ లో విజయంపై ఆశలు పెట్టుకున్నాడు. దీని గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రణాళికలు, సన్నాహకాల గురించి చెప్పాడు. ‘మేము ఇప్పుడు సెమీ ఫైనల్, ఫైనల్ గురించి ఆలోచించడం లేదు. తొలి రౌండ్‌లో ప్రతి ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తున్నాం. అన్ని మ్యాచ్‌లు గెలుపొందడంపై దృష్టి సారిస్తాం. ఆస్ట్రేలియాలో సవాళ్లు బాగానే ఉంటాయి. అదే సమయంలో గత కొన్నేళ్లుగా టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదని తెలుసు. కాబట్టి ఇక్కడి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఆటగాళ్ళు మొదటిసారి ఇక్కడకు వచ్చారు. కొత్త సవాళ్లతో కూడిన మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నాం’ అని రోహిత్ శర్మ తెలిపాడు.

ప్రతి ఒక్కరికీ కీలకం..

కాగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌పై మాట్లాడిన హిట్‌మన్.. ఈ ఇండో-పాక్ మ్యాచ్ ఎప్పటిలాగే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు చాలా మంది అభిమానులు కూడా వస్తుంటారు. ఆటగాడిగా ఈ మ్యాచ్ ప్రతి ఒక్కరికీ కీలకం. పాకిస్థాన్‌పై విజయంతో టీ20 ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభిస్తాం అని చెప్పాడు. సూపర్-12లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు మరో 2 జట్లతో భారత్ కూడా ఆడాల్సి ఉంది. ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించే జట్లలో మేం కూడా ఉంటామన్న నమ్మకం ఉంది. అయితే ప్రస్తుతానికి సెమీ ఫైనల్, ఫైనల్ గురించి ఆలోచించడం లేదు. బదులుగా తొలి రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే మా లక్ష్యం’ అని రోహిత్ శర్మ అన్నాడు.

టీ20 ప్రపంచకప్ టీమ్ ఇండియా షెడ్యూల్ :

అక్టోబరు-23 : భారత్ vs పాకిస్థాన్ – మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అక్టోబర్-27: భారతదేశం vs క్వాలిఫైయర్ గ్రూప్ A రన్నరప్ – సిడ్నీ క్రికెట్ స్టేడియం అక్టోబర్- 30: భారత్ vs సౌతాఫ్రికా – పెర్త్ స్టేడియం నవంబర్-2: భారత్ vs బంగ్లాదేశ్ – అడిలైడ్ ఓవల్ నవంబర్-6: భారత్ vs క్వాలిఫైయర్ B గ్రూప్ విజేత

ఇవి కూడా చదవండి

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ , అర్ష్‌దీప్‌ సింగ్.

రిజర్వ్‌ బెంచ్‌:

మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..