Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. 21న అంగ ప్రదక్షిణ టోకెన్ల విడుదల.. మధ్యాహ్నం ఆ టికెట్లు కూడా..
మధ్యాహ్నం 3 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. అదేవిధంగా 21న ఉదయం 10 గంటల నుండి 24న ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నవంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను శుక్రవారం (అక్టోబర్ 21)న ఆన్‌లైన్లో విడుదల చేయనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ఇక అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. అదేవిధంగా 21న ఉదయం 10 గంటల నుండి 24న ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి. ఈ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఈ నెల 25న సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల 30 నిముషాల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. అలాగే నవంబర్ 8న ఏర్పడనున్న చంద్ర గ్రహణం కారణంగా మరోమారు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. నవంబర్ 8న ఉదయం 8 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 7 గంటల 30 నిముషాల వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కాగా గ్రహణం రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నీ రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక అక్టోబర్ 24న ఆలయంలో దీపావళీ ఆస్థానం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..