Rohit Sharma: టీమిండియాకి ఆ ఇద్దరే పిచ్చోళ్లు.. రాసిపెట్టుకోండి.! కప్పు కొట్టి తెస్తారు
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలుపు అవకాశాలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మెగా టోర్నీలో భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ గెలుపు అవకాశాలపై రోహిత్ శర్మ కీలక విషయాలు మాట్లాడారు. హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ కీలక పాత్ర పోషిస్తారని, వారి ఆల్ రౌండ్ నైపుణ్యం, డెత్ ఓవర్ల బౌలింగ్‌కు ప్రాధాన్యతనిచ్చారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి సవాల్‌గా మారతారని, వికెట్ తీసే బౌలర్లకే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే..! భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలుపు అవకాశాలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మెగా టోర్నీలో భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. జట్టులో హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ పాత్ర అత్యంత కీలకమని రోహిత్ నొక్కి చెప్పారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అందించే ఆల్ రౌండ్ బ్యాలెన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు. అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్లలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడని, 2024 ఫైనల్‌లో అతని ప్రదర్శనను ప్రశంసించారు.
స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి సవాల్‌గా మారతారని పేర్కొన్న రోహిత్.. మంచు ప్రభావం వల్ల ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం రిస్క్ అని హెచ్చరించారు. వికెట్ తీయగలిగే బౌలర్లకే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో కుల్దీప్ యాదవ్‌పై సరదాగా వ్యాఖ్యానిస్తూ, “గల్లీ క్రికెటర్‌లా ప్రతి బంతికి అప్పీల్ చేయొద్దు, రివ్యూల విషయంలో నేను కుల్దీప్‌ని నమ్మను” అని చమత్కరించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టు విజయం సాధించాలని రోహిత్ ధీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి




