AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ధోనీని కెప్టెన్ చేయడం వేస్ట్.. ఒక్క మ్యాచ్ కూడా గెలవదు: చెన్నై మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

MS Dhoni: ఐపీఎల్ 2025లో 5సార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై టీం కష్టాలు పడుతోంది. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన చెన్నై జట్టు తొలి మ్యాచ్‌లో గెలిచి, మిగతా 4 మ్యాచ్‌ల్లో పరాజయాలు పాలైంది. ఈ క్రమంలో చెన్నై కెప్టెన్సీలోనే మార్పు చోటు చేసుకుంది.

IPL 2025: ధోనీని కెప్టెన్ చేయడం వేస్ట్.. ఒక్క మ్యాచ్ కూడా గెలవదు: చెన్నై మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
Dhoni Ipl Csk
Venkata Chari
|

Updated on: Apr 11, 2025 | 5:21 PM

Share

MS Dhoni: ఐపీఎల్ (IPL) 2025 లో ఎంఎస్ ధోని ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఫినిషర్ పాత్రలో ఆకట్టుకోలేకపోయాడు. దీని కారణంగా అతని ఆటపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ధోని కెప్టెన్సీని తిరిగి చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. దీంతో చెన్నై మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఓ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీని కెప్టెన్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటూ బిగ్ షాకిచ్చాడు.

దారుణంగా చెన్నై పరిస్థితి..

5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై జట్టు.. ఐపీఎల్ 2025లో గ్రూప్ దశలోనే ముగిసేలా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. చెన్నై జట్టు -0.889 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి చేరుకుంది. ఇంతలో, చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. దీంతో చెన్నై తదుపరి మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీ గురించి వార్తలు వినిపించాయి. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మిస్టర్ కూల్ ధోని ఒకడనే సంగతి తెలిసిందే. ధోని కెప్టెన్సీ చేపట్టినా.. చెన్నై జట్టు విజయానికి మాత్ర గ్యారెంటీ లేదంటూ ఉతప్ప చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: IPL 2025: టీమిండియాలో ప్లేస్ కోసం ఖర్చీఫ్ వేసిన ఐదుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు.. లిస్ట్‌లో ప్రీతీ ఫేవరేట్

ఇవి కూడా చదవండి

రాబిన్ ఉతప్ప ఏం చెప్పాడంటే..?

బెంగళూరు, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఉతప్ప మాట్లాడుతూ, ‘ధోని కెప్టెన్ కావడం వల్ల చెన్నై పరిస్థితిలో పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోను. ఆ జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. వాటికి పరిష్కారం చూపకపోతే చెన్నై గెలవడం కష్టం. రుతురాజ్ లాంటి బలమైన బ్యాట్స్‌మన్‌ను ఎలా భర్తీ చేస్తారో కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు.

కోల్‌కతాతో తదుపరి మ్యాచ్..

చెన్నై జట్టు తన ఆరో మ్యాచ్‌ను కోల్‌కతాతో ఆడనుంది. గత 4 మ్యాచ్‌ల్లో చెన్నై జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. ఇప్పుడు ధోని కెప్టెన్సీలో జట్టు గెలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం మాత్రం చెన్నైకి అసాధ్యంగా మారింది.

ఇది కూడా చదవండి: Fastest Century in IPL: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే.. టాప్ 5లో ప్రీతి జింటా ప్లేయర్

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..