AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: దేశాన్ని ఊపేసిన సినిమా సీన్‌ రీ క్రియేట్‌.. తన సెలబ్రేషన్‌ వెనుక అసలు అర్థాన్ని బయటపెట్టిన రాహుల్‌!

ఐపీఎల్ 2025లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి గెలుపు అందించాడు. అనంతరం చేసిన సెలబ్రేషన్ కాంతార సినిమా నుండి ప్రేరణ పొందినదని వెల్లడించాడు. చిన్నస్వామి స్టేడియంలో చిన్నప్పటి నుండి ఆడిన తన అనుబంధాన్ని ఈ సెలబ్రేషన్ ద్వారా తెలియజేశాడు. ఈ ఘట్టం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

KL Rahul: దేశాన్ని ఊపేసిన సినిమా సీన్‌ రీ క్రియేట్‌.. తన సెలబ్రేషన్‌ వెనుక అసలు అర్థాన్ని బయటపెట్టిన రాహుల్‌!
Kl Rahul
SN Pasha
|

Updated on: Apr 11, 2025 | 4:42 PM

Share

ఐపీఎల్‌ 2025లో భాగంగా గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ అద్భుత పోరాటంతో ఓడిపోతుందనుకున్న ఢిల్లీ మ్యాచ్‌ను చాలా ఈజీగా గెలిచింది. 30 పరుగులకే 30 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా.. రాహుల్‌ 53 బంతుల్లో 93 పరుగుల మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి.. ఢిల్లీ ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే.. విన్నింగ్‌ షాట్‌ కొట్టాకా.. కేఎల్‌ రాహుల్‌ చేసుకున్న సెలబ్రేషన్స్‌ వైరల్‌గా మారాయి. కర్ణాటకకు చెందిన కేఎల్‌ రాహుల్‌.. ఈ చిన్నస్వామి గడ్డ నాది అని అర్థం వచ్చేలా.. గ్రౌండ్‌లో ఒక సర్కిల్‌ వేసి.. అందులో బ్యాట్‌ పాతుతున్నట్లు సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

ఈ సెలబ్రేషన్స్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాయి. తనను కాదనుకున్న ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు కౌంటర్‌గానే రాహుల్‌ ఈ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు అనుకున్నారు. కానీ, తన సెలబ్రేషన్స్‌ వెనుక ఉన్న అసలు అర్థాన్ని రాహుల్‌ బయటపెట్టాడు. తన ఫేవరేట్‌ సినిమా కాంతారలో సీన్‌ రీక్రియేట్‌ చేస్తూ.. ఇది నా ప్లేస్‌, నా గ్రౌండ్‌ అని అర్థం వచ్చేలా ఆ సెలబ్రేషన్స్‌ చేసినట్లు రాహుల్‌ వివరించాడు. రిషభ్‌ శెట్టి నటించిన కాంతార సినిమా సూపర్‌ సక్సెస్‌ అందుకొని.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

మన తెలుగులో కూడా కాంతార భారీ సక్సెస్‌ అందుకుంది. ఆ సినిమా క్లైమాక్స్‌లో హీరో రిషభ్‌ శెట్టికి దేవుడు పూనిన తర్వాత కత్తితో నేలపై సర్కిల్‌ గీసి.. అందులో కత్తి గుచ్చే సీన్‌ ఒకటి ఉంటుంది. ఈ నేలకు నేను కాపాలా అనే అర్థాన్ని చెప్పే సన్నివేశం అది. అదే సీన్‌ను రీ క్రియేట్‌ చేస్తూ.. ఈ గ్రౌండ్‌ నా స్వస్థలం అని చెప్పాలనే అలా చేసినట్లు రాహుల్‌ వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి ఇదే గ్రౌండ్‌లో ఆడుతూ పెరిగానంటూ రాహుల్‌ పేర్కొన్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..