- Telugu News Photo Gallery Cricket photos From Vaibhav Arora to Vipraj Nigam Including 5 uncapped players May get place in team india t20i Sqaud after ipl 2025
IPL 2025: టీమిండియాలో ప్లేస్ కోసం ఖర్చీఫ్ వేసిన ఐదుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు.. లిస్ట్‌లో ప్రీతీ ఫేవరేట్
5 Uncapped Players: టీం ఇండియా గురించి చెప్పాలంటే, ఐపీఎల్ తర్వాత, టెస్ట్ టీం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. అదే సమయంలో, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీ20 టీం ఇండియా దృష్టి 2026లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌పై ఉంటుంది. దీని కోసం సెలెక్టర్లు చాలా మంది ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.
Updated on: Apr 09, 2025 | 6:29 PM

5 Uncapped Players: ఐపీఎల్ 2025 ప్రస్తుతం ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కొన్ని జట్లు ప్లే ఆఫ్స్ కోసం తమ సత్తా చాటుతున్నాయి. మరికొన్ని జట్లు చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచాయి. ఇక ఈ ఏడాది కూడా కొంతమంది యువ ఆటగాళ్లు అద్బుతమైన ఆటతో సత్తా చాటుతున్నారు. దీంతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ లిస్టులో టాప్ 5 ప్లేయర్లను ఓసారి చూద్దాం..

ఈ జాబితాలో కేకేఆర్ తరపున ఆడే ఫాస్ట్ బౌలర్ వైభవ్ అరోరా పేరు కూడా ఉంది. వైభవ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టగా, గత సీజన్‌లో అతను 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అరోరా పేరు కూడా ముందుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడే విప్రజ్ నిగమ్ తన బౌలింగ్, బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే విప్రజ్ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల ఇన్నింగ్స్‌తో విజయం సాధించాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత మూడవ మ్యాచ్‌లో కూడా అతను రెండు వికెట్లు పడగొట్టాడు. లెగ్ బ్రేక్ బౌలర్ మాత్రమే కాదండోయ్.. తుఫాన్ బ్యాటింగ్ చేసే సత్తా విప్రరాజ్‌కు ఉంది. దీంతో భవిష్యత్తులో టీం ఇండియాలో కూడా స్థానం సంపాదించుకోవచ్చు.

ముంబై ఇండియన్స్ తరపున తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అశ్విని కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టి అద్భుతాలు చేశాడు. అశ్విని ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అతను కూడా ఈ సీజన్‌లో సందడి చేయడం ద్వారా టీమ్ ఇండియాలో తనదైన ముద్ర వేయగలడు.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నుంచి ఆడుతున్న మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి తన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. రతి ఐదు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు కూడా ఎనిమిది కంటే తక్కువగా ఉంది.

టీమ్ ఇండియాలో చోటు సంపాదించడానికి, పంజాబ్ కింగ్స్ తరపున ఆడే తుఫాను ఓపెనర్ ప్రియాంష్ ఆర్య పేరు కూడా చర్చలోకి వచ్చింది. చెన్నైపై ప్రియాంష్ 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. 42 బంతుల్లో ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. దీనివల్ల ఈ ఆటగాడిని భవిష్యత్తులో టీం ఇండియాలో కూడా చూడవచ్చు.




