AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: పంజాబ్ ను చిత్తు చేసి దర్జాగా ఫైనల్‌లోకి అడుగుపెట్టిన RCB.. 9 ఏళ్ల అనంతరం రచ్చలేపారుగా!

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌లో RCB పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అడుగుపెట్టింది. పంజాబ్ బ్యాటింగ్‌ను జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ వంటి బౌలర్లు తుడిచేశారు. ఫిల్ సాల్ట్ అర్ధశతకంతో విజయాన్ని సులభం చేశారు. ఇక RCBకు ఫైనల్‌లో ఎవరుంటారో మిగిలిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు తేల్చనున్నాయి. PBKS తిరిగి గెలిస్తే, మళ్లీ RCB vs PBKS మ్యాచ్‌ను ఫైనల్‌గా చూడవచ్చు. లేకపోతే, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ లేదా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ RCBకి పోటీగా నిలిచే అవకాశముంది. ఫైనల్ కోసం ఆసక్తికరమైన ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి! 

IPL 2025: పంజాబ్ ను చిత్తు చేసి దర్జాగా ఫైనల్‌లోకి అడుగుపెట్టిన RCB.. 9 ఏళ్ల అనంతరం రచ్చలేపారుగా!
Rcb Ipl Final
Narsimha
|

Updated on: May 29, 2025 | 10:31 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్లేఆఫ్స్  (PBKS vs RCB) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి 9 ఏళ్ల తర్వాత తమ మొదటి IPL ఫైనల్‌కు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ (PBKS) పూర్తిగా విఫలమైంది. జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ మరియు భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లు కట్టుదిట్టమైన లైన్లు వేసి పంజాబ్ బ్యాటింగ్‌ను కుదిపేశారు.

ప్రియాంశ్ ఆర్య తొలి వికెట్‌గా వెనుదిరగ్గా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ శ్రేయాస్ అయ్యర్ వెంటనే అవుట్ అయ్యారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి పంజాబ్ 48/4తో నిలిచింది. ఆ తర్వాత, మిడిలార్డర్‌లో సుయాష్ శర్మ కీలక వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్ యొక్క ఆశలను పూర్తిగా చీల్చేశాడు. మార్కస్ స్టోయినిస్ కొంత పోరాటం చేసినప్పటికీ అది చాలలేదు. రికీ పాంటింగ్, ముషీర్ ఖాన్‌కు ఆఖరి అవకాశంగా అరంగేట్రం ఇచ్చినా, మొత్తం ఆట వారి కోసం విఫలమైంది.

RCB బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న ఫిల్ సాల్ట్

వెరిగిన 102 పరుగుల లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. ఫిల్ సాల్ట్ అర్ధశతకం కొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 8 వికెట్ల నష్టంతో మ్యాచ్‌ను ముగిస్తూ, బెంగళూరు జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు అడుగుపెట్టింది. 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు RCB చేరడం అభిమానులను ఖుషి చేసింది. టోర్నమెంట్‌లో తమ స్థిరమైన ప్రదర్శనను ఇలాగే కొనసాగించాలని వారు ఆశిస్తున్నారు.

RCB ఫైనల్‌లో ఎదుర్కొనే జట్టు గురించి తేలాలంటే, మిగిలిన రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి:

ఎలిమినేటర్: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ – మే 30

క్వాలిఫైయర్ 2: ఎలిమినేటర్ విజేత vs పంజాబ్ కింగ్స్ – జూన్ 1

క్వాలిఫైయర్ 2లో గెలిచిన జట్టు జూన్ 3న ఫైనల్‌లో RCBని ఎదుర్కొంటుంది.

పంజాబ్ కింగ్స్ మొదటి మ్యాచ్‌లో ఓడినా, టాప్ 2లో ఉండటం వల్ల వారికి ఇది రెండో అవకాశం.

PBKS తిరిగి గెలిస్తే, మళ్లీ RCB vs PBKS మ్యాచ్‌ను ఫైనల్‌గా చూడవచ్చు. లేకపోతే, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ లేదా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ RCBకి పోటీగా నిలిచే అవకాశముంది. ఫైనల్ కోసం ఆసక్తికరమైన ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..