AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: నా బెస్ట్ ఇన్నింగ్స్ అదేనన్న కోహ్లీ.. అనుష్కతోపాటు షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన ఫ్యాన్స్..

Virat Kohli-Anushka Sharma: ఐపీఎల్ మధ్య జరిగిన ఓ ఈవెంట్‌లో కోహ్లీ, అనుష్క పాల్గొన్నారు. అక్కడ వారు తమ అనుభవాలను, చిలిపి చేష్టలను బెంగళూరు అభిమానులతో పంచుకున్నారు. ఈ సమయంలో బెంగళూరు ఫ్యాన్స్ అనుష్క ముందు కోహ్లీకి జీరోలు చూపించడం ప్రారంభించారు.

Virat Kohli: నా బెస్ట్ ఇన్నింగ్స్ అదేనన్న కోహ్లీ.. అనుష్కతోపాటు షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన ఫ్యాన్స్..
Virat Anushka
Venkata Chari
|

Updated on: May 27, 2023 | 3:56 PM

Share

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన భార్య అనుష్క శర్మ కూడా అతనితో కలిసి ఇంగ్లాండ్‌కు బయలుదేరింది. ఇంగ్లాండ్ చేరుకున్న తరువాత అనుష్క శర్మ కేన్స్ ఫెస్టివల్‌కు బయలుదేరింది. అయితే, తాజాగా కోహ్లీ, అనుష్కల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది IPL 2023 సమయంలో తీసిన వీడియో.

ఐపీఎల్ మధ్య జరిగిన ఓ ఈవెంట్‌లో కోహ్లీ, అనుష్క పాల్గొన్నారు. అక్కడ వారు తమ అనుభవాలను, చిలిపి చేష్టలను బెంగళూరు అభిమానులతో పంచుకున్నారు. ఈ సమయంలో బెంగళూరు ఫ్యాన్స్ అనుష్క ముందు కోహ్లీకి జీరోలు చూపించడం ప్రారంభించారు, దీనిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ ఫన్నీగా తీసుకుని, నవ్వుతూ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

‘జీరో’నే అత్యుత్తమ ఇన్నింగ్స్..

నిజానికి కోహ్లి ఈ విషయాన్ని బెంగళూరు ప్రజలకు చాలా ఫన్నీగా చెప్పాడు. జీరో పాయింట్‌లో తనే నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ సందర్భంగా కోహ్లీని తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గురించి అడిగారు. కోహ్లీ సమాధానమిస్తూ చివరి ఇన్నింగ్స్‌(ఏప్రిల్ 23న) తన అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లి ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు. అయితే, అందులో అతను సున్నాకి ఔట్ అయ్యాడు.

కోహ్లీ సమాధానం విని, కార్యక్రమానికి హాజరైన అభిమానులు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. కోహ్లి తన చేతితో సున్నా గుర్తు చూపిస్తూ, బిగ్గరగా నవ్వుతూ తాను బెంగళూరు నుంచి వచ్చానని అనుష్కకు చెప్పుకొచ్చాడు. అభిమానుల స్పందన చూసిన కోహ్లి మీరు బెంగళూరు నుంచి వచ్చారా? అంటూ సరదగా నవ్వుతూ కనిపించారు.

639 పరుగులు చేసిన కోహ్లీ..

బెంగళూరు అభిమానులకు కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. తన సరదా సమాధానాలపై బెంగళూరు అభిమానుల స్పందన చూసి కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 639 పరుగులు చేశాడు. అతని జట్టు బెంగళూరు ప్రయాణం లీగ్ దశలోనే ముగిసింది. బెంగళూరు 14 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..