AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: జడేజాతో ఢీ కొట్టనున్న పంత్.. ఎందుకో తెలుసా?

Ravindra Jadeja vs Rishabh Pant: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత ఇద్దరు స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ తలపడనున్నారు. వీరిద్దరూ రంజీ ట్రోఫీలో ఆడినట్లు కనిపించనున్నారు. పంత్ ఢిల్లీ జట్టులో, జడేజా సౌరాష్ట్ర జట్టులో భాగంగా ఉన్నారు. జనవరి 23 నుంచి ఇరు జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Team India: జడేజాతో ఢీ కొట్టనున్న పంత్.. ఎందుకో తెలుసా?
Rishabh Pant Vs Jadeja
Venkata Chari
|

Updated on: Jan 19, 2025 | 4:50 PM

Share

Ravindra Jadeja vs Rishabh Pant: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం పాలైన తర్వాత, దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని భారత ఆటగాళ్లకు క్రికెట్ దిగ్గజాలు సలహా ఇచ్చారు. ఇటీవల, సమీక్ష సమావేశం తర్వాత, బీసీసీఐ తమ ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్ ఆడడాన్ని తప్పనిసరి చేసింది. ఆ తర్వాత, త్వరలో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ రెండవ రౌండ్‌లో భారతదేశానికి చెందిన చాలా మంది స్టార్ ఆటగాళ్లు కనిపించనున్నారు. రంజీ ట్రోఫీలో ఆడాలనే నిర్ణయాన్ని రోహిత్ శర్మ ధృవీకరించాడు. ఈ దేశవాళీ టోర్నీలో రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ కూడా ఆడటం ఖాయమైంది. జడేజా, పంత్ త్వరలో ఒకరితో ఒకరు ఢీ కొట్టడం కనిపిస్తుంది.

జనవరి 23న జడేజా-పంత్‌ల ఢీ..

జనవరి 18న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలకు కూడా చోటు దక్కింది. ఫిబ్రవరి 20 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే ఈ టోర్నీలో భారత్ తన పోరాటాన్ని ప్రారంభించనుంది. దీనికి ముందు జడేజా, పంత్‌లు తలపడనున్నారు. రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్‌లో సౌరాష్ట్ర, ఢిల్లీ జట్ల మధ్య జనవరి 23న మ్యాచ్ జరగనుంది. పంత్ ఢిల్లీకి ఆడనుండగా, జడేజా సౌరాష్ట్ర జట్టుకు ఆడనున్నాడు. జనవరి 2023 నుంచి రెండేళ్ల తర్వాత జడేజా రంజీ ట్రోఫీలో భాగమవుతాడు.

ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్న జడేజా..

జడేజా జనవరి 23 నుంచి ఢిల్లీతో రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇందుకోసం సిద్ధమవుతూనే జడేజా శిక్షణలో పాల్గొన్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ.. ‘జడేజా ఈరోజు శిక్షణకు వచ్చాడు. అతను తదుపరి మ్యాచ్ ఆడతాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

రోహిర్‌తో పాట్ గిల్-జైస్వాల్ కూడా..

విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ ఆడుతున్నట్లు కనిపించాడు. అయితే, గాయం కారణంగా అతను ఇప్పుడు ఆడలేడు. ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ జమ్మూకశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో కనిపించనున్నాడు. శనివారం విలేకరుల సమావేశంలో అతను రంజీ ట్రోఫీ ఆడాలనే తన ఉద్దేశాన్ని ధృవీకరించాడు. వీరితో పాటు టీమిండియా యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కూడా ఈ దేశవాళీ టోర్నీలో ప్రకంపనలు సృష్టించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..