IND vs PAK: రమీజ్‌రాజాకు పదవీ గండం.. పీసీబీ చీఫ్ నుంచి ఉద్వాసన! భారత్‌పై విద్వేష వ్యాఖ్యల ఫలితమేనా?
తన పదవీకాలంలో పని కంటే విపరీతమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన రమీజ్ రాజా త్వరలో పీసీబీ చీఫ్‌గా ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మాజీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజామ్ సేథీని మళ్లీ ఈ స్థానంలో నియమించనున్నారని పాక్ మీడియా చెబుతోంది
ఒకవైపు కరాచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించేందుకు పాక్ జట్టు అష్టకష్టాలు పడుతుండగా.. మరోవైపు పీసీబీ చీఫ్ రమీజ్ రాజా తన సీటును నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. తన పదవీకాలంలో పని కంటే విపరీతమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన రమీజ్ రాజా త్వరలో పీసీబీ చీఫ్‌గా ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మాజీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజామ్ సేథీని మళ్లీ ఈ స్థానంలోనియమించనున్నారని పాక్ మీడియా చెబుతోంది. గత కొన్ని నెలలుగా బీసీసీఐపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన రాజా.. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాకిస్థాన్‌కు రాకపోతే మా జట్టు కూడా ఉండదని బీసీసీఐని బెదిరించాడు. అయితే ఇప్పుడు ప్రపంచకప్, ఆసియాకప్ గురించి పక్కనపెడితే రమీజ్ రాజాకు తన స్థానాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం, పీసీబీ మాజీ ఛైర్మన్ నజం సేథీ డిసెంబర్ 17న లాహోర్‌లో పాక్ ప్రధాని షరీఫ్‌ను కలిశారని, ఆయనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ పదవిని ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పాక్ ప్రధాని పేరెంట్ కాబట్టి బోర్డు చైర్మన్ నియామకంపై తుది నిర్ణయం పాకిస్థాన్ ప్రధానిదే. ఇలా సేథీ ప్రధానిని సందర్శించడం కూడా పీసీబీ మార్పును ధృవీకరించింది.
భారత్‌పై విద్వేషం..
రమీజ్ రాజా 2021లో పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అప్పటి ప్రధాని, పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఈ బాధ్యతను రమీజ్‌కు అప్పగించారు. అప్పటి నుండి, రమీజ్ రాజా భారత క్రికెట్ జట్టు, బీసీసీఐ గురించి ఏదో ఒక వివాదాస్పద ప్రకటనలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల ఎంపికలో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇమ్రాన్‌ఖాన్ పాక్ ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత, రమీజ్ రాజా కూడా ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురవుతారని పుకార్లు వచ్చాయి. కానీ రాజా ఎలాగోలా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్ బోర్డు నిబంధనల ప్రకారం అధ్యక్షుడి పదవీ కాలం 3 సంవత్సరాలు. అయితే ఇప్పుడు హల్ చల్ చేస్తున్న వార్తలే నిజమైతే రమీజ్ పదవీ కాలానికి ముందే తప్పించనున్నట్లు తెలుస్తుంది.
సేథీ ఎవరంటే?
నజామ్ సేథీ విషయానికొస్తే, ప్రఖ్యాత జర్నలిస్ట్ గా పాకిస్తాన్ క్రికెట్‌తో చాలా కాలంగా అనుబంధం ఉంది. గతంలో రెండు సార్లు పీసీబీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. మొదట 2013 నుండి 2014 వరకు ఛైర్మన్‌గా ఉన్న సేథీ, ఆ తర్వాత 2017 నుండి 2018 వరకు పీసీబీకి నేతృత్వం వహించారు. పాకిస్తాన్ ప్రీమియర్ T20 టోర్నమెంట్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించిన ఘనత కూడా కీర్తి సేథీకి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..