Video: భారీ షాట్ ఆడబోయిన బ్యాట్స్‌మెన్.. గాల్లోకి ఎగిరిన బెయిల్స్.. ఇంతలో ఊహించని ట్విస్ట్.. షాక్‌లో ఫీల్డర్లు..
మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మార్క్ స్టేకెటీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికి నిక్ మాడిన్సన్ స్క్వేర్ లెగ్ బౌండరీ వైపు పుల్ షాట్ ఆడాడు.
బీబీఎల్ 2022 12వ సీజన్ ప్రారంభమైంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. కాగా, డిసెంబర్ 15 మెగా ఈవెంట్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ బ్రిస్బేన్ హీట్‌తో తలపడింది. ఇందులో మెల్‌బోర్న్ జట్టు 22 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మార్క్ స్టేకెటీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికి నిక్ మాడిన్సన్ స్క్వేర్ లెగ్ బౌండరీ వైపు పుల్ షాట్ ఆడాడు. అతను షాట్ ఆడిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు, వికెట్ల నుంచి బెయిల్ పడిపోయింది. మాడిసన్ హిట్ వికెట్ అయ్యాడని అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ, అతను బ్యాట్‌తో గ్రౌండ్ నుంచి పెవిలియన్ చేరడం మొదలుపెట్టాడు. ఇంతలోనే అంపైర్ అతన్ని ఆపాడు. థర్డ్ అంపైర్ రీప్లేలో తనిఖీ చేయగా, బలమైన గాలి కారణంగా బెల్ కింద పడిపోయినట్లు తేలింది. ఈ ఫన్నీ సంఘటన వీడియోను బిగ్ బాష్ లీగ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
వీడియోను షేర్ చేస్తూ, క్యాప్షన్‌లో ‘ గాలి బెల్‌ను పడగొట్టినట్లు కనిపిస్తోంది. మాడిసన్ సేఫ్ అయ్యాడు’ అంటూ రాసుకొచ్చింది.
What on earth???
Looks like the wind’s knocked the bail off! Maddinson stays safe ?@KFCAustralia #BucketMoment #BBL12 pic.twitter.com/sboxGvIewA
— KFC Big Bash League (@BBL) December 15, 2022
విజయం సాధించిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ జట్టుకు శుభారంభం లభించింది. కెప్టెన్ నిక్ మాడిసన్, శామ్ హార్పర్ తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు.
ఆ తర్వాత హార్పర్ 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. తొలి వికెట్ పతనం తర్వాత, జట్టు వికెట్లు నిర్ణీత వ్యవధిలో పడిపోతూనే ఉన్నాయి. అయితే మాడిసన్ తన చక్కటి బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అతను 49 బంతుల్లో 87 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా బ్రిస్బేన్ హీట్ 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేయగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..