Blind T20 World Cup: అంధుల ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత్‌.. వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో శనివారం (డిసెంబర్ 17) జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగుల భారీస్కోరు సాధించింది.

Blind T20 World Cup: అంధుల ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత్‌.. వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా
Team India
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2022 | 5:57 PM

భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ప్రపంచకప్‌ను గెలవలేకపోవచ్చు..అయితే భారత పురుషుల అంధుల జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన ప్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత్ వేదికగా జరుగుతున్న మూడో అంధుల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ను ఫైనల్లో 120 పరుగుల భారీ తేడాతో ఓడించి టీమిండియా టైటిల్ గెలుచుకుంది. అంధుల క్రికెట్‌లో భారత్‌కు ఇది హ్యాట్రిక్ కప్పు కావడం విశేషం. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో శనివారం (డిసెంబర్ 17) జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 277 పరుగుల భారీస్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 120 పరుగుల తేడాతో మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది .6 దేశాల మధ్య డిసెంబర్ 5 నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో.. ఆరంభం నుంచి భారత జట్టుదే ఆధిపత్యం. లీగ్‌ రౌండ్‌ మ్యాచ్‌ల్లో తొలిస్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో భారత్ 207 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ రెండో సెమీఫైనల్‌లో శ్రీలంకను ఓడించింది.

హ్యాట్రిక్ ఛాంపియన్ గా..

కాగా టీమిండియాకు ఇది మూడో ప్రపంచకప్‌ కావడం విశేషం. 2012లో తొలిసారిగా టోర్నీ నిర్వహించగా అందులో భారత్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2017లో జరిగిన రెండో టోర్నీలో బెంగళూరులో జరిగిన ఫైనల్లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు 2022లో భారత్ కూడా కప్‌ కొట్టి ఈ టోర్నీలో హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. ఈనేపథ్యంలో మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..