Rajasthan Royals: ఆ సీనియర్ స్పిన్నర్‌ను రాజస్థాన్ రాయల్స్ వదులుకోనుందా..?

అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాక భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో కూడా అశ్విన్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. అయితే అతనికి..

Rajasthan Royals: ఆ సీనియర్ స్పిన్నర్‌ను రాజస్థాన్ రాయల్స్ వదులుకోనుందా..?
Rajasthan Royals
Follow us

|

Updated on: Nov 15, 2022 | 12:43 PM

భారత క్రికెట్ జట్టులోని కీలక ఆటగాళ్ల లిస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ ఉంటాడు. దాదాపుగా అన్నీ మ్యాచ్‌లలో తనదైన స్పిన్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాక భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో కూడా అశ్విన్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. అయితే అతనికి సంబంధించిన వార్త ఒకటి వైరల్‌గా మారింది. అదేమిటంటే.. త్వరలో జరగబోయే ఐపీఎల్ మిని ఆక్షన్(వేలం పాట)కు ముందుగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని వదులుకోబోతుందని. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ XI పంజాబ్, ఢిల్లీ కాపిటల్స్ వంటి ఐపీఎల్ జట్లలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌ను.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంపాటలో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.

అతని కోసం రాజస్థాన్ జట్టు 5 కోట్లను వెచ్చించింది. అయితే ఇప్పుడు అశ్విన్‌ను వదులుకోవడం ద్వారా ఆ జట్టు 5 కోట్లను విడిపించుకోగలుగుతుంది. కాగా, అశ్విన్ కోసం ఢిల్లీ కాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 2022 ఫిబ్రవరి వేలంపాటలో పోటీ పడగా.. రాజస్థాన్ పైచేయి సాధించి అతన్ని పొందింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టోర్నమెంట్‌గా ప్రసిద్ధి పొందిన ఐపీఎల్‌లో అతను మంచి రికార్డులనే నమోదు చేశాడు. ఐపీఎల్ 2022 లో.. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 12 కీలక వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లలో అతని ఎకనామీ 7.51 గా ఉంది. బ్యాంటింగ్‌లో కూడా 12 ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ 27.29 యావరేజ్‌తో 191 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో తలపడే 10 జట్లు.. తాము వదులుకోవాలి, అంటిపెట్టుకోవాలి అనుకున్న ఆటగాళ్ల వివరాలను నవంబర్ 15 లోపు తెలియజేయాలని బీసీసీఐ కోరింది. కాగా, కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఐపీఎల్ మినీ యాక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..