Shardul Thakur: కేకేఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టీమ్ లోకి శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ.. అలా చేశాడని అమ్మేసిన ఢిల్లీ..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్‌ను యాజమాన్యం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అమ్మేసింది. 2022 ఐపీఎల్ మెగా వేలంలో రూ.10.75 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు టీమ్స్...
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్‌ను యాజమాన్యం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అమ్మేసింది. 2022 ఐపీఎల్ మెగా వేలంలో రూ.10.75 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు టీమ్స్ తమ ప్లేయర్స్‌ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ మరో ప్లేయర్‌ను అమ్మేసింది. స్టార్ పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను ఆ టీమ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌కు అమ్మేసింది. గతేడాది వేలంలో శార్దూల్‌ను ఢిల్లీ టీమ్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. నవంబర్ 14నే ఈ డీల్ పూర్తయినట్లు తెలిసింది. ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ టీమిండియాతో కలిసి న్యూజిలాండ్ టూర్‌లో ఉన్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఆడిన శార్దూల్‌ను గత వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో అతడు పెద్దగా రాణించలేకపోయాడు. 14 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశాడు. అటు బ్యాట్‌తోనూ కేవలం 120 రన్స్ మాత్రమే చేయగలిగాడు.
ఈ ప్రదర్శనతో శార్దూల్‌ను వేరే టీమ్‌ను ఇచ్చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించింది. వచ్చే నెల 23 న వేలం నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం నవంబర్ 15 లోపు ప్లేయర్స్ ట్రేడ్ డీల్స్ పూర్తి కావాల్సి ఉంది. శార్దూల్ కోసం చెన్నై, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ కూడా ప్రయత్నించినా.. చివరికి కోల్‌కతాకు అమ్మేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే ఇలాంటివి మూడు డీల్స్ కుదుర్చుకుంది. గుజరాత్ టైటాన్స్ నుంచి లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్‌లను కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇప్పుడూ శార్దూల్‌ను కూడా తీసుకోవడంతో ఆ టీమ్ మరింత స్ట్రాంగ్‌గా మారింది.
మరోవైపు ఇంగ్లండ్ బ్యాటర్, కోల్‌కతా టీమ్‌లోనే ఉన్న సామ్ బిల్లింగ్స్ ఈసారి ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించాడు. టెస్ట్ క్రికెట్‌పై దృష్టి సారించడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిల్లింగ్స్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని అన్నాడు. తనకు అవకాశం ఇచ్చిన కోల్‌కతా టీమ్‌కు థ్యాంక్స్ చెప్పాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..