Glenn Maxwell: గాయాల ఊబిలో పడిన మరో కీలక ఆటగాడు.. భారత్ టూర్‌కు అతను..
ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం గాయాల పర్వం నడుస్తోంది. ఒక జట్లు తర్వాత మరో జట్టు అన్న మాదిరిగా అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. ఫలితంగా కీలకమైన..
ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం గాయాల పర్వం నడుస్తోంది. ఒక జట్లు తర్వాత మరో జట్టు అన్న మాదిరిగా అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. ఫలితంగా కీలకమైన టోర్నీలకు, సిరీస్‌లకు దూరమవుతున్నారు. భారత జట్టులో కూడా గాయాలపాలయిన కీలక ఆటగాళ్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా గాయాల కారణంగానే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగం కాలేకపోయారు. అయితే ఇప్పుడు తాజాగా అస్ట్రేలియాకు చెందిన కీలక ఆటగాడు, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఆటకు దూరం అయ్యాడు. అందుకు కారణం అతని కాలు విరగడమే. దీనికి సంబంధించిన వీడియోను మాక్స్‌వెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్‌బోర్న్ స్టార్స్ (బీబీఎల్ టీమ్) ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఇటీవల స్నేహితుడి బర్డే పార్టీకి వెళ్లిన మ్యాక్సీ.. ఫ్రెండ్‌తో కలిసి సరదాగా పరుగులు తీస్తూ కాలు జారి కింద పడ్డాడు. అలా కింద పడడంతో అతని కాలి ఎముక విరిగిందని అస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. అతని కాలుకు ఆపరేషన్ జరిగిందని, అయితే అతను పూర్తి స్థాయిలో ఎప్పటికి కోలుకుంటాడో తెలియరాలేదని ఆ దేశ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. గురువారం నుంచి అస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులో ఉండడు. అతని గాయం తీవ్రతను బట్టి అతను త్వరలో జరగబోయే బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)కు కూడా ఆడలేకపోవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని.. ఇంగ్లాండుతో జరగబోయే వన్డే సీరిస్‌లో అతని స్థానాన్ని సీన్ అబాట్‌తో భర్తీ చేయనున్నట్లు అస్ర్టేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. అంతేకాక వచ్చే సంవత్సరం భారత్‌తో జరగబోయే సిరీస్‌లకు కూడా అతను అందుబాటులో ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అస్ట్రేలియా 2023 ఫిబ్రవరి-మార్చి నెలలో భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
టీ20 ప్రారంభం కాకముందు నుంచే ప్రపంచ క్రికెట్‌ను గాయాలు వెంటడుతున్నాయి. గాయాల కారణంగానే బూమ్రా, జడ్డూ భారత్ జట్టుకు దూరమయ్యారు. అలాగే ఇంగ్లాండ్ జట్టుకు జానీ బెయిర్ స్టో, అస్ట్రేలియాకు జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. అలాగే పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ కూడా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ముందు గాయపడ్డాడు. ఎలాగో టోర్నీ నాటికి గాయాల నుంచి కోలుకున్నాడు.