‘టీ20 ప్రపంచకప్ 2024 సారథిగా ఆయనే.. ఆ సిరీస్‌తోనే సరికొత్త టీమిండియాను చూస్తాం’: మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు..

India vs New Zealand: టీమిండియాకు మరింతమంది ఫాస్ట్-బాల్ ఆల్-రౌండర్లు కావాలి. 1983 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2007 టీ20 ప్రపంచ కప్ మనం ఎందుకు గెలిచాం? ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

'టీ20 ప్రపంచకప్ 2024 సారథిగా ఆయనే.. ఆ సిరీస్‌తోనే సరికొత్త టీమిండియాను చూస్తాం': మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు..
Hardik Pandya
Follow us
Venkata Chari

|

Updated on: Nov 14, 2022 | 9:45 PM

టీ20 ప్రపంచకప్‌ 2024కు ముందు హార్దిక్ పాండ్యాను పొట్టి ఫార్మాట్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలని, న్యూజిలాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి టీమిండిమా పునర్నిర్మాణాన్ని ప్రారంభించాలని సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఓడిన భారత్ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ నుంచే నిష్క్రమించింది. ఈ ఘోర పరాజయంతో గత ఆరు ప్రపంచకప్‌లలో భారత్‌ ఐదో నాకౌట్‌ ఓటమిని నమోదు చేసింది. “నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ని అయితే, 2024 ప్రపంచకప్‌నకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండాలని నేను నమ్ముతాను. అలాగే చేస్తాను” అని స్టార్ స్పోర్ట్స్ షో ‘లో శ్రీకాంత్ అన్నాడు. “ఈ రోజు నుంచి ఒక జట్టును పునర్నిర్మించడం ప్రారంభించండి. మరో వారంలో జరగబోయే న్యూజిలాండ్ సిరీస్ నుంచే ఇది మొదలుకావాలని సూచించాడు” అని తెలిపాడు.

“వరల్డ్ కప్ కోసం ప్రిపరేషన్‌ను అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాల ముందుగానే మొదలవుతుంది. కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది ట్రై చేయాలి. ఒక సంవత్సరం పాటు ప్రయత్నించాలి. అప్పుడు మీరు ఒక జట్టును ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. 2023 నాటికి ఇది ప్రపంచ కప్‌ను ఆడబోయే స్థాయిలో ఉండేలా చూసుకోండి” అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌లో 3 T20Iలు, అనేక ODIలు ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. హార్దిక్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ఫాస్ట్ బాల్ ఆల్ రౌండర్లు కావాలి..

2024 ఎడిషన్‌కు ముందు భారత్ ఎక్కువమంది ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లను గుర్తించాల్సిన అవసరం ఉందని మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. “టీమిండియాకు మరింతమంది ఫాస్ట్-బాల్ ఆల్-రౌండర్లు కావాలి. 1983 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2007 టీ20 ప్రపంచ కప్ మనం ఎందుకు గెలిచాం? టీంలో ఫాస్ట్-బాల్ ఆల్-రౌండర్లు, సెమీ-ఆల్-రౌండర్లు ఉన్నారని” ఆయన చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

హుడా లాంటి వారే కావాలి..

“కాబట్టి, హుడా లాంటి కుర్రాళ్లను గుర్తించాలి. హుడా వంటి వారు ఇంకా చాలా మంది టీంకు కావాల్సి ఉంటుందని గుర్తించాలి” అని ఆక్ష్న అన్నారు. 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో భాగమైన మాజీ భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, భారత్ కేవలం ఒక కెప్టెన్‌పై ఆధారపడకూడదని, జట్టులో నాయకుల సమూహాన్ని అభివృద్ధి చేయాలని సూచించాడు. “కెప్టెన్‌ని మార్చితే ఫలితం మారుతుందని నేను చెప్పడం లేదు, అలా వెళితే ఫలితం మారదు. హార్దిక్ పాండ్యా నుంచి కొన్ని విషయాలు గమనించాలి. అతను ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. అతనికి గాయాల సమస్యలు కూడా ఉన్నాయి” అని పఠాన్ తెలిపాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..