టీమిండియా టీ20 జట్టులో భారీ మార్పులు.. కెప్టెన్ నుంచి ఆ సీనియర్లపై వేటు.. యంగ్ టీం బాధ్యతలు అతనికే?

India T20 Squad: వచ్చే ప్రపంచకప్‌ను చూస్తుంటే, టీ20 ఫార్మాట్‌లో ఆ ఇద్దరు సీనియర్లు చివరి మ్యాచ్ ఆడేశారని తెలుస్తోంది. మరోవైపు దిగ్గజాల భవిష్యత్తుపై..

టీమిండియా టీ20 జట్టులో భారీ మార్పులు.. కెప్టెన్ నుంచి ఆ సీనియర్లపై వేటు.. యంగ్ టీం బాధ్యతలు అతనికే?
Team India
Follow us

|

Updated on: Nov 13, 2022 | 7:40 AM

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఘోర పరాజయం పాలైన భారత టీ20 జట్టులో కీలక మార్పులు రానున్నాయని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు టీ20 జట్టుకు దూరంగా ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో టీ20 జట్టులో చాలా మార్పులు చోటుచేసుకుంటాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్, ఆర్ అశ్విన్ లాంటి ఆటగాళ్లు మెల్లగా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది.

బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ- ‘ప్రపంచకప్‌ను చూస్తుంటే, టీ20 ఫార్మాట్‌లో కార్తీక్, అశ్విన్‌ల చివరి మ్యాచ్ ఆడేశారని అని తెలుస్తోంది. మరోవైపు రోహిత్, కోహ్లీల భవిష్యత్తుపై నిర్ణయాన్ని బోర్డు వారికే వదిలేసిందని తెలిపాయి.

కాగా, న్యూజిలాండ్ టూర్‌కు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మొత్తం కోచింగ్ సిబ్బందిని బీసీసీఐ విశ్రాంతిపై పంపింది. ఈ పర్యటనలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఇంగ్లండ్‌తో ఓడిపోయిన తర్వాత బోర్డు తీసుకున్న చర్యలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

1. రోహిత్ త్వరలో టీ20ల నుంచి రిటైర్మెంట్?

ఇది సాధ్యమే. ఎందుకంటే అతను సెమీ-ఫైనల్‌లో ఓటమి తర్వాత చాలా విచారంగా కనిపించాడు. అతడిని కోచ్ రాహుల్ ద్రవిడ్ హ్యాండిల్ చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియా ముందు ప్రకటనలోనూ రోహిత్ కనిపించలేదు. కేవలం ద్రవిడ్ మాత్రమే పాల్గొన్నాడు.

బోర్డు ఎవరినీ రిటైర్మెంట్ కోరలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇది ఆటగాళ్ల సొంత నిర్ణయం అవుతుంది. అవును, 2023లో వచ్చే 12 నెలల టీ20 షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ సమయంలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌లపై దృష్టి పెడతారు. ఆటగాళ్లు కోరుకోకపోతే రిటైర్మెంట్ ప్రకటించరు. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు వచ్చే ఏడాది T20 ఆడటం కనిపించకపోవచ్చని తెలుస్తోంది.

2. టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..

సెమీఫైనల్స్ తర్వాత అటు బోర్డులోనూ, ఇటు టీమ్‌లోనూ రేపిన అలజడితో 2 ఏళ్ల తర్వాత అంటే 2024 జూన్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో మార్పులు రావచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కొత్త జట్టుతోనే సుదీర్ఘకాలం కెప్టెన్సీ అప్పగించడం పరిగణించవచ్చని తెలుస్తోంది.

3. రోహిత్-విరాట్‌లపై కోచ్ ద్రవిడ్ మాట..

ఈ ప్రశ్నపై కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే దాని గురించి మాట్లాడటం చాలా తొందరగా ఉంది. ఈ ఆటగాళ్లు మా అత్యుత్తమ ప్రదర్శనకారులు. మా దగ్గర కొందరు గొప్ప ఆటగాళ్లున్నారు. ఆటగాళ్లను తొలగించడం గురించి ఆలోచించడానికి లేదా మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు. మాకు ముందు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. తదుపరి ప్రపంచకప్‌నకు భారత్ సిద్ధమవ్వాల్సి ఉందంటూ తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..