IND vs ENG: ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే.. సెమీస్‌లో భారత్ ఘోర పరాజయం.. ఫైనల్ చేరిన ఇంగ్లండ్..

T20 World Cup Match Report, India vs England: భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం వికెట్ నష్టపోకుండా టార్గెట్‌ను ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా బౌలర్లపై భీకరంగా దాడి చేశారు.

IND vs ENG: ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే.. సెమీస్‌లో భారత్ ఘోర పరాజయం.. ఫైనల్ చేరిన ఇంగ్లండ్..
Team India Vs England
Follow us
Venkata Chari

|

Updated on: Nov 10, 2022 | 5:08 PM

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో టీమిండియా ఘోర ఓటమితో, మరోసారి ఫ్యాన్స్‌కు నిరాశనే మిగిల్చింది. దీంతో అద్భుతంగ ఆడిన ఇంగ్లండ్ జట్టు నవంబర్ 13న పాక్ జట్టుతో ఫైనల్ ఆడనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి, 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం వికెట్ నష్టపోకుండా టార్గెట్‌ను ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా బౌలర్లపై భీకరంగా దాడి చేశారు. ఈ క్రమంలో హేల్స్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, భారత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అలాగే మరో ఎండ్ నుంచి ఇంగ్లండ్ సారథి కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఎన్నో అంచనాలతో సెమీస్ చేరిన టీమిండియాకు మరోసారి ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టింది.

టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లీ మాత్రమే రాణించాడు. కోహ్లీ 50 పరుగులు చేశాడు. హార్దిక్‌తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హార్దిక్ కూడా అద్భుతంగా ఆడి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పోరాడే స్కోర్ అందించినా.. బౌలర్లు మాత్రం ఆ స్కోర్‌ను కాపాడడంలో ఘెరంగా విఫలమయ్యారు. అటు ఫీల్డింగ్‌లోనూ టీమిండియా మరోసారి వైఫల్యాన్ని ప్రదర్శించింది.

ఇంగ్లండ్ ఏకపక్ష విజయం.. చిత్తుగా ఓడిన భారత్..

ఇవి కూడా చదవండి

ఇంగ్లిష్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ 183 స్ట్రైక్ రేట్ వద్ద 86 పరుగులు చేశాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 163 స్ట్రైక్ రేట్‌తో 80 పరుగులు చేశాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఎలాంటి పొరపాటు చేయకుండా లక్ష్యాన్ని సులువుగా ఛేదించారు. భారత్ బౌలర్లను చితక్కొట్టారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు తప్పులు చేసి, మరోసారి ఒట్టిచేతులతో ఇంటి బాట పట్టింది.

భారత్ ప్లేయింగ్ XI:

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:

జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం