Watch Video: ఇంత భయమేంటి బ్రో.. టాప్ 8 అంటే మరీ ఇంతలానా.. మరోసారి నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్..
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో కేఎల్ రాహుల్ బ్యాట్ నిరాశపరిచింది. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, పెవిలియన్ చేరాడు. మరోసారి పెద్ద మ్యాచ్‌ల్లో ఫ్లాప్ అయ్యాడు.
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ అడిలైడ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన మార్క్ వుడ్ స్థానంలో బెన్ స్టోక్స్ బౌలింగ్ ప్రారంభించాడు. కేఎల్ రాహుల్ తొలి బంతికే ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌లోనే క్రిస్ వోక్స్ బంతికి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 7 ఓవర్లలో 46 పరుగులు చేసింది.
టాప్ 8 జట్లు అంటే వణికిపోయిన రాహుల్..
కీలక మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ త్వరగా పెవిలియన్ చేరాడు. దీంతో గత ప్రపంచ కప్‌లో రాహుల్ ప్రదర్శనలు చూస్తే రాహుల్ గణాంకాలు ఏమాత్రం బాగోలేవు. టాప్ 8 ర్యాంకుల్లో నిలిచిన టీంలతో ఆడిన మ్యాచ్‌ల్లో అయితే, మరీ దారుణంగా తయారయ్యాడు.
View this post on Instagram
టాప్ 8 జట్లపై టీ20 ప్రపంచ కప్‌ల్లో రాహుల్ ప్రదర్శనలు..
3(8) vs Pak Dubai
18(16) vs NZ Dubai
4(8) vs Pak Melbourne
9(14) vs SA Perth
5(5) vs Eng Adelaide
ఆదిలోనే ఔట్ నుంచి తప్పించుకున్న కోహ్లి, రోహిత్..
సామ్ కుర్రాన్ వేసిన మూడో ఓవర్ తీసుకొచ్చాడు. రెండో బంతి బ్యాట్ ఔటర్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ లోకి వెళ్లినా ఆటగాడికి చేరలేదు. కోహ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. దీని తర్వాత నాలుగో ఓవర్‌లో కవర్స్ మీదుగా సిక్సర్ బాదాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ చేస్తున్నాడు. ఐదో ఓవర్లో సామ్ కుర్రాన్ వేసిన నాలుగో బంతికి రోహిత్ కట్ షాట్ ఆడాడు. బంతి బ్రూక్స్ చేతులకు తగిలి విసిరింది.
View this post on Instagram
మ్యాచ్ పరిస్థితి..
15 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. విరాట్ 43, పాండ్యా 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రోహిత్ 27, రాహుల్ 5 , సూర్య 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోర్డాన్, వోక్స్, రషీద్ తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..