IND vs NZ: కివీస్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా.. నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న షాకింగ్ ఫొటో..

India vs New Zealand: న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టు బయలుదేరింది. అయితే, తెరపైకి వచ్చిన ఓ ఫొటో నెట్టింట్లో సంచలనంగా మారింది.

IND vs NZ: కివీస్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా.. నెట్టింట్లో హల్ చల్ చేస్తోన్న షాకింగ్ ఫొటో..
Indian Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Nov 12, 2022 | 9:54 PM

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో ఓడిన తర్వాత టీమ్ ఇండియా తన తదుపరి పర్యటనకు బయలుదేరింది. టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి. టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచ కప్ 2022 నుంచి జట్టు నిష్క్రమణ తర్వాత ఓ ఫొటో తెరపైకి వచ్చింది. అందులో జట్టులోని కొంతమంది ఆటగాళ్లు విమానాశ్రయంలో నేలపైనే నిద్రిస్తున్నట్లు కనిపించారు.

ఆటగాళ్ళు విమానాశ్రయంలోనే నిద్రపోయారు..

ఈ ఫొటోలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ముగ్గురూ ఒకరి సపోర్టుతో ఒకరు నిద్రపోతున్నారు. సూర్య గోడకు ఆనుకుని ఉన్నాడు. రిషబ్ పంత్ సూర్య కాలు మీద తల ఉంచి, చాహల్ పంత్ మీద తల పెట్టి నిద్రిస్తున్నాడు. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.

సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..

నవంబర్ 18 శుక్రవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అదే సమయంలో, సిరీస్‌లోని రెండవ మ్యాచ్ నవంబర్ 20, ఆదివారం, చివరి మ్యాచ్ నవంబర్ 22న మంగళవారం జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 25 శుక్రవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్‌లోనూ మొత్తం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు వరుసగా నవంబర్ 25, 27, 30 తేదీల్లో జరుగుతాయి. వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మొత్తం పర్యటనలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు.

ఇవి కూడా చదవండి

Ind Vs Nz Tour

టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా..

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ సిరాజ్.

వన్డే సిరీస్‌కు టీమిండియా..

శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ సేన్‌దీప్, కెమ్రాన్ చాహర్, దీపక్ చాహర్.

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్