T20 World Cup: సెమీస్ ఓటమి ఎఫెక్ట్.. ప్రమాదంలో ఆ ఇద్దరి కెరీర్‌.. టీ20ఐల నుంచి రిటైర్మెంట్?

ఎన్నో అంచనాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత్.. చిత్తుగా ఓడి టీ20 ప్రపంచకప్ నుంచి ఇంటిబాట పట్టింది. దీంతో ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియాకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల టీ20 అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోవచ్చని తెలుస్తోంది.

T20 World Cup: సెమీస్ ఓటమి ఎఫెక్ట్.. ప్రమాదంలో ఆ ఇద్దరి కెరీర్‌.. టీ20ఐల నుంచి రిటైర్మెంట్?
Team India
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2022 | 8:51 PM

టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓటమితో ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం కూడా ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 168 పరుగులు చేసినప్పటికీ దానిని కాపాడుకోలేకపోయింది. ఇంగ్లండ్ ఓపెనర్ల తుపాన్ బ్యాటింగ్‌తో 4 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలుచుకుంది. దీంతో టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత, టీమిండియా నుంచి ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల టీ20 అంతర్జాతీయ కెరీర్ ముగియవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోనుందని, అలాగే రవిచంద్రన్ అశ్విన్ కెరీర్ కూడా అతనితో పాటే గుడ్‌బై చెప్పవచ్చని తెలుస్తోంది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో రోహిత్ కష్టపడుతున్నాడు. అతను మునుపటిలా వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. రోహిత్‌తో పాటు భారత జట్టుకు కెప్టెన్సీలో కొన్ని యంగ్ ప్లేయర్ల ఎంపికలు కూడా ఉన్నాయి. అలాగే బ్యాటింగ్‌లోనూ ఎంపికలు చాలానే ఉన్నాయి.

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌తో అశ్విన్ దాదాపు 4 ఏళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి వచ్చాడు. 2017 నుంచి అశ్విన్‌కు నిరంతరం టెస్టుల్లో మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయి. అయితే గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్‌నకు ముందు అతన్ని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మూడు వరుస ఫార్మాట్లలో భారత జట్టులో భాగమయ్యాడు. కానీ, అతను టీ20 ఇంటర్నేషనల్స్‌లో ప్రభావంతంగా నిరూపించుకోలేకపోయాడు. అశ్విన్‌కు నిరంతర అవకాశాల కారణంగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో యుజ్వేంద్ర చాహల్ వంటి అత్యుత్తమ టీ20 బౌలర్‌కు భారత్ అవకాశం ఇవ్వలేదు. దీంతో మాజీల నుంచి విమర్శలు మొదలయ్యాయి. అటు ఈ ఓటమితో టీ20ల నుంచి విరాట్ కోహ్లీ కూడా తప్పుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..