AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: బెంగళూరు వద్దంది.. ముంబై ముద్దంది.. 3 ఏళ్ల తర్వాత రోహిత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బౌలర్..

ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ బెహ్రెన్‌డార్ఫ్ 2019లో ముంబై ఇండియన్స్ తరపున 5 మ్యాచ్‌లు ఆడాడు. ఆ సీజన్‌లో రోహిత్ శర్మ జట్టు టైటిల్ గెలుచుకుంది.

IPL 2023: బెంగళూరు వద్దంది.. ముంబై ముద్దంది.. 3 ఏళ్ల తర్వాత రోహిత్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బౌలర్..
Mimbai Indians Jason Behrendorff
Venkata Chari
|

Updated on: Nov 12, 2022 | 9:13 PM

Share

భారత క్రికెట్ జట్టుకు మరో టీ20 ప్రపంచకప్‌లోనూ విఫలమైంది. దీంతో భారత అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నారు. సహజంగానే ఇప్పుడు అందరి దృష్టి ఇంగ్లండ్-పాకిస్తాన్ ఫైనల్‌పైనే ఉంటుంది. అయితే భారత అభిమానులకు రాబోయే కొద్ది రోజుల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మద్దతు ఉంది. కొత్త సీజన్ ప్రారంభం కావడానికి సమయం ఉంది. అయితే రిటెన్షన్, ట్రేడింగ్ విండో, వేలం గురించి మరికొన్ని రోజులపాటు చర్చ జరుగనుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను ట్రేడింగ్ చేసి, జట్టులోకి చేర్చుకుంది.

ముంబై ఇండియన్స్, బెంగుళూరు జట్లు నవంబర్ 12, శనివారం జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ట్రేడింగ్‌ను ప్రకటించాయి. ఎడమచేతి వాటం బెహ్రెన్‌డార్ఫ్ ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మెగా వేలంలో RCB కొనుగోలు చేసింది. బెహ్రెన్‌డార్ఫ్‌ను కొనుగోలు చేయడానికి, RCB వేలంలో కేవలం రూ. 75 లక్షలు మాత్రమే వెచ్చించింది. ఇది ఆస్ట్రేలియా బౌలర్ ప్రాథమిక ధరగా నిలిచింది. అయితే, అతను IPL 2022 సీజన్‌లో RCB తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

మూడేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి..

IPL అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ శనివారం బెహ్రెన్‌డార్ఫ్ ట్రేడ్ గురించి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్రాంచైజీ ప్రకటన ప్రకారం, ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ 2018, 2019 సీజన్‌లలో టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు MI కుటుంబంలో భాగమయ్యాడు. ఇప్పుడు 2023 సీజన్‌లో అతనిని మళ్లీ నీలం, బంగారు రంగులో (MI జెర్సీ రంగులు) చూస్తారంటూ ఓ ట్వీట్ చేసింది.

2019లో రంగప్రవేశం..

2018లో తొలిసారిగా ఐపీఎల్‌లో బెహ్రెండార్ఫ్ గాయం కారణంగా అతను ఈ సీజన్‌లో ఆడలేకపోయాడు. తర్వాత 2019లో అతను MI కోసం అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో 5 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీశాడు. బెహ్రెన్‌డార్ఫ్‌ను 2021 సీజన్‌లో గాయం భర్తీగా CSK చేర్చుకుంది. కానీ అతనికి ఆ సీజన్‌లో ఏ మ్యాచ్‌ని కూడా ఆడే అవకాశం రాలేదు.

బెహ్రెన్‌డార్ఫ్ 2019లో ముంబైతో కలిసి టైటిల్ గెలుచుకున్న జట్టులో భాగంగా ఉన్నాడు. గత 2 సీజన్‌లు ముంబైకి అంతగా రాణించకపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బెహ్రెండార్ఫ్ రాకతో బౌలింగ్‌ను పటిష్టం చేయాలని టీం భావిస్తోంది. బెహ్రెన్‌డార్ఫ్ ఆస్ట్రేలియా తరపున 12 ODIలు, 9 T20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 16 ODI వికెట్లు, 7 T20 వికెట్లు అతని ఖాతాలో చేరాయి. మొత్తంమీద ఈ బౌలర్‌కు 105 టీ20 మ్యాచ్‌ల అనుభవం ఉంది. అందులో అతను 7.41 ఎకానమీతో 117 వికెట్లు తీసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..