ఆంధ్రా కుర్రాడు.. కానీ న్యూజిలాండ్ క్రికెటర్.. సచిన్, ద్రావిడ్ అంటే ఇష్టం.. అతడెవరంటే.!
ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు.. కానీ దేశవాళీ టోర్నీల్లో దుమ్ముదులిపాడు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దీనితో..
ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు.. కానీ దేశవాళీ టోర్నీల్లో దుమ్ముదులిపాడు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. దీనితో సెలెక్టర్స్ దృష్టిలో పడ్డాడు.. నేషనల్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఎవరనుకుంటున్నారా.? అతడే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర. అదేంటి కివీస్ క్రికెటర్ గురించి ఇంత పెద్ద టాపిక్ అని ఆశ్చర్యపోకండి. అతడికి ఇండియాతో అవినాభావ సంబంధం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
గత కొన్ని సంవత్సరాలుగా రవీంద్ర ఇండియాలో ఆఫ్-సీజన్ టూర్‌లలో భాగంగా దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు. రవీంద్ర తండ్రి రవి కృష్ణముర్తి ఆంధ్రావాసి. ఉద్యోగరిత్యా బెంగళూరు వెళ్లారు. 1990వ సంవత్సరంలో ఆయన బెంగళూరు నుంచి న్యూజిలాండ్‌కు పయనమయ్యారు. ఆయన న్యూజిలాండ్‌లో హట్ హాక్స్ క్లబ్‌ను స్థాపించాడు. ఈ క్లబ్ ప్రతీ ఏడాది వేసవిలో ఆటగాళ్ళను భారతదేశానికి తీసుకువస్తాడు. జేమ్స్ నీషమ్, టామ్ బ్లండెల్ వంటి అంతర్జాతీయ న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఈ పర్యటనలలో భాగం అయిన వారే.
“నేను గత నాలుగేళ్లుగా ప్రతీ సంవత్సరం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్( RDT) అనంతపురంలో శిక్షణ పొందుతున్నానని” రవీంద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా, రవీంద్ర ప్రస్తుతం న్యూజిలాండ్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇండియాతో తలబడనున్నాడు.
What’s young @cricketwgtninc star Rachin Ravindra looking forward to about being in the same squad as Kane Williamson for the first time? #ENGvNZ pic.twitter.com/Hbe38KtIOd
— BLACKCAPS (@BLACKCAPS) May 19, 2021
Also Read:
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!