- Telugu News Photo Gallery Sports photos Not virat or dhoni or sachin but aryaman birla is richest indias cricketer here is why
ధోని, విరాట్ కంటే ముందు.. దేశంలో ధనిక క్రికెటర్ ఇతడే.. 11 ఇన్నింగ్స్ 795 పరుగులు చేశాడు..
Indian Cricketer: భారతదేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరు? ఈ ప్రశ్నకు ఠక్కున కోహ్లీ, ధోని, లేదా సచిన్ అంటారు.. అయితే వీరెవరూ కాదు..
Updated on: May 19, 2021 | 10:08 PM

భారతదేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరు? ఈ ప్రశ్నకు ఠక్కున కోహ్లీ, ధోని, లేదా సచిన్ అంటారు.. అయితే వీరెవరూ కాదు..

ఇండియాలో అత్యధిక ధనవంతుడైన క్రికెటర్ 23 ఏళ్ల ఆర్యమన్ బిర్లా. అతని తండ్రి పెద్ద వ్యాపారవేత్తఅయిన కుమార్ మంగళం బిర్లా, వీరి ఆస్తులు సుమారు 70 వేల కోట్లు.

ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగమైన ఆర్యమన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతను చిన్నతనం నుండే క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటూ వచ్చాడు. సీకే నాయుడు ట్రోఫీలో 11 ఇన్నింగ్స్‌లలో 79.50 సగటుతో 795 పరుగులు చేశాడు. జూనియర్ స్థాయిలో కూడా ఆర్యమాన్ పేరిట 4 సెంచరీలు, 1 ఫిఫ్టీ ఉంది. రంజీలలో మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

భారతదేశంలోని సంపన్న క్రికెటర్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండవ స్థానంలో ఉన్నాడు, మొత్తం 1090 కోట్ల రూపాయల ఆదాయం.

ధనిక భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ తరువాత ధోని మూడో స్థానంలో ఉన్నాడు. మొత్తం ఆదాయం రూ .767 కోట్లు.

విరాట్ కోహ్లీ. ఈ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ 638 కోట్లు. విరాబ్ కోహ్లీ ప్రస్తుతం ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్ల జాబితాలో 66 వ స్థానంలో ఉన్నాడు.





























