ఐఏఎస్ సాధించిన ఏకైక భారత క్రికెటర్..! ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరో తెలుసా..?

Amay Khurasiya : భారత జట్టులో ఓ గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు. అతను ఆట, చదువు రెండింటిలోనూ విజయం సాధించాడు. డిగ్రీ సంపాదించడమే

ఐఏఎస్ సాధించిన ఏకైక భారత క్రికెటర్..! ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ.. ఎవరో తెలుసా..?
Amay Khurasiya
Follow us
uppula Raju

|

Updated on: May 19, 2021 | 4:40 PM

Amay Khurasiya : భారత జట్టులో ఓ గ్రేట్ క్రికెటర్ ఉన్నాడు. అతను ఆట, చదువు రెండింటిలోనూ విజయం సాధించాడు. డిగ్రీ సంపాదించడమే కాదు ఏకంగా దేశంలో అత్యంత కష్టతరమైన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. తరువాత భారత క్రికెట్ జట్టులో చేరాడు. ఈ ఆటగాడి పేరు అమయ్ ఖురాసియా. ఇతను 90 వ దశకంలోని భారత జట్టులో ఉండేవాడు. అమయ్ ఖురాసియా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించాడు. అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్.. భారత జట్టులో చోటు సంపాదించడానికి ముందు అతను ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. భారత కస్టమ్స్, ఎక్సైజ్ విభాగంలో ఇన్స్‌పెక్టర్‌గా నియమించబడ్డాడు.

అతను 1989-1990 సీజన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 2004-2005 సీజన్ వరకు ఆడుతున్నాడు. దేశీయ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ తరఫున 119 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 40.80 సగటుతో 7304 పరుగులు చేశాడు. అతని ఉత్తమ స్కోరు 238. మొదటి విభాగంలో 21 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు చేశాడు. అతను 1990-91, 1991-92, 2000-01 ఫస్ట్-క్లాస్ సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

శ్రీలంకతో జరిగిన 1999 పెప్సి కప్‌లో ఖురాసియా భారత్ తరఫున వన్డేలో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో రెండో బంతికే ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత 45 బంతుల్లో 57 పరుగులు చేశాడు. తన తొలి వన్డేలో అర్ధ సెంచరీ సాధించిన ఎనిమిదవ భారత క్రికెటర్ అయ్యాడు. పెప్సి కప్‌లో అతని ఆటతీరు 1999 ప్రపంచ కప్‌కు టీమ్ ఇండియాలో చోటు సంపాదించింది. కానీ అతనికి ఆడటానికి అవకాశం రాలేదు.

అనంతరం అతన్ని జట్టు నుంచి తప్పించారు. అయితే 2001లో ఖురాసియాకు మళ్లీ భారత జట్టులో స్థానం లభించింది. ఈసారి మళ్ళీ శ్రీలంకపై అతనికి అవకాశం లభించింది కానీ ఆ సమయంలో అతని బ్యాట్ మాట్లాడలేదు. దీంతో మళ్లీ అతనికి భారత జట్టులో స్థానం లభించలేదు. ఖురాసియా భారత్ తరఫున 12 వన్డేలు ఆడాడు. 13.54 సగటుతో 149 పరుగులు చేశాడు. ఖురాసియా పదవీ విరమణ చేసినప్పుడు అంతర్జాతీయంగా విజయం సాధించలేకపోయాడని విచారం వ్యక్తం చేశాడు. 2007 లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తరువాత శిక్షణ, వ్యాఖ్యానంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.

Viral Video : డేంజర్ బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ మరో ఘనత..! మామూలు వ్యక్తి కాదు కదా..?

AP Gender Budget: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు

CM KCR Gandhi Hospital Visit Live: కరోనా బాధితులకు ముఖ్యమంత్రి భరోసా.. గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ పర్యటన