IPL 2024: ఇదేంటి కావ్యా పాప.! కప్పు తెచ్చినోడికి ఎసురుపెట్టేశావ్.. SRH కొత్త కెప్టెన్ అతడా?
అప్పుడెప్పుడూ 2016లో తొలిసారిగా కప్పు కొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత ఎడిషన్లు మారుతున్నాయ్.. కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, పోతున్నారు. అయితేనేం ఎలాంటి లాభం లేదు. హైదరాబాద్ జట్టు రాత మాత్రం మారట్లేదు. ఇక గతేడాది పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే..

అప్పుడెప్పుడూ 2016లో తొలిసారిగా కప్పు కొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత ఎడిషన్లు మారుతున్నాయ్.. కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, పోతున్నారు. అయితేనేం ఎలాంటి లాభం లేదు. హైదరాబాద్ జట్టు రాత మాత్రం మారట్లేదు. ఇక గతేడాది పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే.. మరీ పేలవంగా ఆడి.. ఏకంగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మొత్తంగా 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలోనే విజయం సాధించి.. అట్టర్ ప్లాప్ జట్టుగా పేరు మూటగట్టుకుంది.
కప్పు తెచ్చిన వార్నర్‌కు ఉద్వాసన పలికి.. కేన్ మామకు పగ్గాలు ఇచ్చింది.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కేన్ మామ నుంచి సఫారీ బ్యాటర్ మార్క్‌రమ్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. అయినా జట్టు పరిస్థితిలో మార్పు లేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 మినీ వేలంలో కెప్టెన్ కోసం వేట మొదలుపెట్టి.. రూ. 20.50 కోట్లకు ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను దక్కించుకుంది. తాజా ఎడిషన్‌లో అతడికి హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఏకీభవిస్తున్నాడు.
‘కమ్మిన్స్ కొనుగోలు ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసొచ్చే అంశం. అతడి కోసం ఆ యాజమాన్యం వేలంలో ఎక్కువ ఖర్చుపెట్టిన మాట వాస్తవమే. కానీ హైదరాబాద్ జట్టుకు నాయకుడు అవసరం. గత కొన్ని సీజన్ల నుంచి ఆ వెలితి జట్టులో కొట్టోచ్చినట్టు కనిపిస్తోంది. ఇక గత సీజన్‌లో చెత్త కెప్టెన్సీ కారణంగా హైదరాబాద్ భారీ మూల్యం చెల్లించింది. అయితే ఈసారి కమ్మిన్స్ జట్టు కెప్టెన్‌గా కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.




