PAK vs NZ: టాస్ గెలిచిన పాక్.. తొలి గెలుపు కోసం ప్లేయింగ్ 11లో భారీ మార్పులు.. డేంజరస్ మాన్‌స్టర్స్‌తో బరిలోకి
Pakistan vs New Zealand, 1st Match, Group A: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ నేడు గ్రూప్ ఏ జట్లు పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్. కాగా, న్యూజిలాండ్ 2000 సంవత్సరంలో టైటిల్ గెలుచుకుంది. టోర్నమెంట్ చరిత్రలో పాకిస్తాన్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయింది. కాగా, టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

ఈ రెండు జట్లు చివరిసారిగా ఈ నెల 14న వన్డేలో తలపడ్డాయి. ట్రై-సిరీస్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి న్యూజిలాండ్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా రెండు జట్ల నుంచి ఒక్కొక్క ఆటగాడు దూరమయ్యాడు. పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయూబ్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ లు జట్టుకు దూరమయ్యారు.
ఇరు జట్లు:
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, విలియం ఓరూర్క్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(w/c), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
A mouth-watering match-up on the opening day of the #ChampionsTrophy 🔥
Find out how you can watch the big match here 📺 👉 https://t.co/AIBA0YZyiZ pic.twitter.com/r18cySFFT3
— ICC (@ICC) February 19, 2025
ఈ ఏడాది జట్టు తరఫున విలియమ్సన్ టాప్ స్కోరర్. ఈ ఏడాది వన్డేల్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు తరపున టాప్ స్కోరర్. అతను 3 మ్యాచ్‌ల్లో 225 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ రెండవ స్థానంలో ఉన్నాడు. అతను 6 మ్యాచ్‌ల్లో 188 పరుగులు చేశాడు. బౌలింగ్ లో ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 5 మ్యాచ్‌ల్లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. విలియం ఓ’రూర్కే 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..