- Telugu News Photo Gallery Cricket photos Team India Player Rohit Sharma Became 1st Indian Captain to Whitewash 4 Different opponents in ODI format breaks dhoni and kohli records
ధోని, విరాట్‌లకు అందని ద్రాక్ష.. కట్‌చేస్తే.. అరుదైన ఘనత సాధించిన హిట్ మ్యాన్..
Rohit Sharma Records: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా మరో పెద్ద సిరీస్ విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. ధోని, విరాట్‌లను ఓడించడం ద్వారా రోహిత్ శర్మ ఇప్పుడు ఈ విషయంలో నంబర్ 1 కెప్టెన్‌గా మారాడు.
Updated on: Feb 13, 2025 | 6:46 AM

అహ్మదాబాద్ వన్డేలో ఇంగ్లాండ్‌ను 142 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. నాగ్‌పూర్, కటక్ తర్వాత, అహ్మదాబాద్‌లో కూడా రోహిత్ సేన ఏకపక్ష విజయం సాధించింది. అహ్మదాబాద్ గురించి చెప్పాలంటే, మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 356 పరుగులు చేయగా, ఇంగ్లీష్ జట్టు కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టు సాధించిన ఈ భారీ విజయం తర్వాత, అనేక రికార్డులు నమోదయ్యాయి. అలాగే, మరికొన్ని రికార్డులు బద్దలయ్యాయి. రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా గొప్ప రికార్డును బద్దలు కొట్టాడు. ధోని, విరాట్‌లను కూడా అధిగమించడం గమనార్హం. అహ్మదాబాద్ వన్డే తర్వాత బద్దలైన 5 రికార్డులను ఓసారి చూద్దాం..

1. రోహిత్ రికార్డు: రోహిత్ శర్మ నాయకత్వంలో టీం ఇండియా నాలుగు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. అతను వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇప్పుడు ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియాకు క్లీన్ స్వీప్ విజయాలను అందించాడు. భారత జట్టు ప్రత్యర్థులను మూడుసార్లు క్లీన్ స్వీప్ చేసిన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనిలను అతను అధిగమించాడు.

2. టీం ఇండియా నంబర్ 1: గత 14 సంవత్సరాలలో భారత జట్టు వన్డే సిరీస్‌లలో అత్యధిక సంఖ్యలో క్లీన్ స్వీప్‌లను సాధించింది. ఈ ఘనతను 12 సార్లు అందుకుంది. న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్ విజయాలతో రెండవ స్థానంలో ఉంది.

3. శుభ్‌మాన్ గిల్ అద్భుతం: అహ్మదాబాద్ వన్డేలో శుభమన్ గిల్ కూడా భారీ రికార్డు సృష్టించాడు. ఈ ఆటగాడు 2500 వన్డే పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు, అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వన్డే సెంచరీలు చేసిన ఘనతను కూడా అతను సాధించాడు.

4. ఒకే వేదికపై హ్యాట్రిక్ సెంచరీలు: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శుభ్‌మాన్ గిల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆటగాడు అతనే. దీంతో పాటు, అతను ఈ మైదానంలో ఐపీఎల్ సెంచరీ కూడా సాధించాడు.

5. విరాట్ కోహ్లీ 16 వేల పరుగులు: విరాట్ కోహ్లీ ఆసియా గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లో తన 16 వేల పరుగులను కూడా పూర్తి చేశాడు. అతను సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. ఈ సంఖ్యను చేరుకోవడానికి విరాట్‌కు 340 ఇన్నింగ్స్‌లు పట్టగా, సచిన్ ఇందుకోసం 353 ఇన్నింగ్స్‌లు ఆడాడు.




