AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: వన్డే జట్టు నుంచి తప్పించేందుకు రోహిత్, గంభీర్ స్కెచ్.. కట్‌చేస్తే.. 175 పరుగులతో మెంటలెక్కించిన క్లాసీ ప్లేయర్

Shreyas Iyer: అహ్మదాబాద్‌తో జరిగిన మూడో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అతను తన బ్యాట్‌తో 64 బంతుల్లో 78 పరుగులు చేశాడు. వన్డే సిరీస్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో అయ్యర్ తన విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇప్పుడు రోహిత్, గంభీర్ జోడీ కూడా మౌనంగా ఉండేలా చేయడంతోపాటు, ఇకపై టీం నుంచి తప్పించే ఆలోచనలు మానుకోవాలంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చినట్లైంది.

IND vs ENG: వన్డే జట్టు నుంచి తప్పించేందుకు రోహిత్, గంభీర్ స్కెచ్.. కట్‌చేస్తే.. 175 పరుగులతో మెంటలెక్కించిన క్లాసీ ప్లేయర్
Shreyas Iyer Scored 175 Run
Venkata Chari
|

Updated on: Feb 12, 2025 | 5:30 PM

Share

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ మరోసారి తన విమర్శకుల నోరు మూయించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. అయ్యర్ 64 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అందులో అతను 2 సిక్సర్లు, 8 ఫోర్లతో అజేయంగా నిలిచాడు. ఈ బ్యాటింగ్ ప్రదర్శనతో, అయ్యర్ ఇప్పుడు రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌లను కూడా నిశ్శబ్దం చేశాడు. టీం ఇండియా యాజమాన్యం ఈ ఆటగాడిని మొదటి వన్డే నుంచే దూరంగా ఉంచాలని కోరుకోవడంతో మౌనంగా ఉన్నాడు. కానీ, విరాట్ కోహ్లీ గాయంతో అయ్యర్‌కు ఆడే అవకాశం వచ్చింది. అతను మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అయ్యర్ మూడవ వన్డేలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

175 పరుగులతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్..

అహ్మదాబాద్ వన్డేలో శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ సాధించి, వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. ఈ ఆటగాడు 87.50 సగటుతో 175 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 122 కంటే ఎక్కువ. గొప్ప విషయం ఏమిటంటే, అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రైక్ రేట్‌ను కొనసాగించాడు. ఇది నిజంగా అద్భుతమైనది.

ఇది కూడా చదవండి: Records: 8 ఓవర్లలో హ్యాట్రిక్‌తోపాటు 8 వికెట్లు.. 100 ఏళ్లైనా బ్రేక్ చేయలేని వన్డే ప్రపంచ రికార్డ్ ఏంటో తెలుసా?

4వ స్థానంలో అత్యుత్తమ భారత బ్యాట్స్‌మన్..

2019 ప్రపంచ కప్ తర్వాత భారతదేశం తరపున 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అత్యుత్తమ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. ఇది మాత్రమే కాదు, ప్రపంచ రికార్డులలో 4వ స్థానంలో ఉన్న షాయ్ హోప్ మాత్రమే అతని కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. 2019 ప్రపంచ కప్ నుంచి అయ్యర్ 4వ స్థానంలో 1550 పరుగులు సాధించాడు. సగటున 53.4 పరుగులు సాధించాడు. ఈమేరకు అతను 103.3 అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఆటగాడు. ఇంత గొప్ప ప్రదర్శన ఇచ్చినప్పటికీ, ఒక ప్రధాన కోచ్ లేదా కెప్టెన్ అయ్యర్ లాంటి ఆటగాడిని ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి దూరంగా ఉంచాలని ఆలోచించడం.. మూర్ఖత్వం అనాల్సిందే.

ఇది కూడా చదవండి: Video: 16 సిక్సర్లు, 12 ఫోర్లు.. 49 బంతుల్లో ఊహించని ఊచకోత.. 38 ఏళ్ల ప్లేయర్ బీభత్సం చూశారా?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..