AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS Vs AFG: సెంచరీతో బౌలర్లను ఉతికారేసిన జద్రాన్.. చివర్లో రషీద్ మెరుపులు.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..

Australia vs Afghanistan 1st Innings Highlights: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 39వ మ్యాచ్ జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 292 పరుగుల టార్గెట్ నిలిచింది. ప్రపంచకప్‌లో జద్రాన్ తొలి సెంచరీని పూర్తి చేశాడు. ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘన్‌ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. జద్రాన్ వన్డే కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ.

AUS Vs AFG: సెంచరీతో బౌలర్లను ఉతికారేసిన జద్రాన్.. చివర్లో రషీద్ మెరుపులు.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్..
Aus Vs Afg Score
Venkata Chari
|

Updated on: Nov 07, 2023 | 5:53 PM

Share

Australia vs Afghanistan 1st Innings Highlights: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 39వ మ్యాచ్ జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 292 పరుగుల టార్గెట్ నిలిచింది. ప్రపంచకప్‌లో జద్రాన్ తొలి సెంచరీని పూర్తి చేశాడు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129 పరుగులు) సెంచరీతో ఆసీస్ బౌలర్లపై సత్తా చాటాడు. ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘన్‌ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. జద్రాన్ వన్డే కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ.

ఆస్ట్రేలియా జట్టులో జోష్ హేజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఒక్కో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ నమోదు చేసిన యువ ఆటగాళ్లు..

20y 282d – మొహమ్మద్ అష్రాఫుల్ (BAN), కార్డిఫ్, 2005

21సం 138డి – సచిన్ టెండూల్కర్ (IND), కొలంబో RPS, 1994

21y 309d – డేవిడ్ గోవర్ (ENG), మెల్బోర్న్, 1979

21y 330d – ఇబ్రహీం జద్రాన్ (AFG), ముంబై WS, 2023 WC

21y 341d – క్వింటన్ డి కాక్ (SA), సిడ్నీ, 2014

పవర్‌ప్లేలో పర్వాలేదనిపించిన ఓపెనర్లు..

View this post on Instagram

A post shared by ICC (@icc)

పవర్‌ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ సగటు ఆరంభాన్ని కలిగి ఉంది. తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ డిఫెన్స్ బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత బ్యాడ్ బాల్‌పై భారీ షాట్లు కొట్టారు. ఇద్దరి మధ్య మంచి సమన్వయం కనిపించింది. 7వ ఓవర్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పిన్నర్‌ మాక్స్‌వెల్‌కి బంతిని అందించాడు. మ్యాక్స్‌వెల్ తన ఓవర్‌లో ఒత్తిడి సృష్టించి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జోష్ హేజిల్‌వుడ్ ఈ ఒత్తిడిని గుర్బాజ్ వికెట్ రూపంలో పొందాడు. 8వ ఓవర్ చివరి బంతికి గుర్బాజ్ ప్రమాదకర షాట్ ఆడి మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 46 పరుగులు చేసింది.

ఇరుజట్లు:

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్) , ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్.

ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్) , రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..