T20 World Cup 2024: వామ్మో! ఇదేం బాదుడు భయ్యా! పూరన్ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం దాటిన బంతి.. వీడియో
టీ20 ప్రపంచకప్ 2024లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ శుభారంభం చేసింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచ కప్ 2వ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పాపువా న్యూ గినియాపై అతికష్టమ్మీద నెగ్గింది.

టీ20 ప్రపంచకప్ 2024లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ శుభారంభం చేసింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచ కప్ 2వ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పాపువా న్యూ గినియాపై అతికష్టమ్మీద నెగ్గింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా జట్టుకు శుభారంభం లభించలేదు. 34 పరుగులు మాత్రమే చేసి టాప్ ఆర్డర్ త్రయం పెవిలియన్ బాట పట్టారు. అయితే 4వ నంబర్‌లో మైదానంలోకి దిగిన సీసీ బావు బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. 43 బంతుల్లో 1 భారీ సిక్సర్, 6 ఫోర్లతో 50 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ హాఫ్ సెంచరీ కారణంగానే పపువా న్యూ గినియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే తక్కువ స్కోరు ఛేదనలోనూ విండీస్ తంటాలు పడింది. 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కరేబియన్ జట్టుకు పపువా న్యూ గినియా బౌలర్ అలీ నావో ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. జాన్సన్ చార్లెస్ (0)ని సున్నాకి అవుట్ చేసి తమ జట్టుకు శుభారంభం అందించాడు.
అయితే ఆ తర్వాత పూరన్, కింగ్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కానీ పపువా న్యూ గినియా బౌలర్లు వరుసక్రమంలో వికెట్లు తీస్తూ విండీస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టారు. అయితే రోస్టన్ చేజ్ చివరివరకు క్రీజులో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కరేబియన్ జట్టును గెలిపించాడు. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
వీడియో ఇదిగో..
The man-in-form! 💥
After patiently biding his time, #NicholasPooran unleashes with a MAXIMUM and a boundary! 💪🏻
📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/A4rWKKcCk7
— Star Sports (@StarSportsIndia) June 2, 2024
నికోలస్ పూరన్ 27 పరుగులు, రోమ్ మన్ పావెల్ 15, ఆండ్రీ రస్సెల్ 15 పరుగులతో రాణించి కరేబియన్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో విండీస్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ నికోలస్ పూరన్ కొట్టిన భారీ సిక్స్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. విండీస్ ఇన్నింగ్స్ 6 ఓవర్ వేసిన పీఎన్‌జీ స్పిన్నర్ బౌ.. తొలి బంతిని ఓవర్‌పిచ్ డెలివరీగా సంధించాడు. దీంతో క్రీజులో ఉన్న నికోలస్ పూరన్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి భారీ సిక్సర్ కొట్టాడు. పూరన్ పవర్ హిట్టింగ్ కు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








