AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ‘నీకసలు బుర్ర ఉందా రా’.. అందరిముందే తమ్ముడిని తిట్టేసిన రోహిత్.. ఎందుకంటే?

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 63వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు ప్రత్యేకమైనది. వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించినందున, ఈ ప్రత్యేక గౌరవం తర్వాత జరుగుతున్న మొదటి మ్యాచ్ ఇదే.

Video: 'నీకసలు బుర్ర ఉందా రా'.. అందరిముందే తమ్ముడిని తిట్టేసిన రోహిత్.. ఎందుకంటే?
Rohit Saharma Video
Venkata Chari
|

Updated on: May 17, 2025 | 12:00 PM

Share

Rohit Sharma Scolds Sibling Video: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రత్యేక గౌరవం లభించింది. ప్రత్యేకత ఏమిటంటే, రోహిత్ శర్మ పేరుతో కొత్త స్టాండ్‌ను ఆవిష్కరించారు. శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో రోహిత్ శర్మ స్టాండ్‌కు పేరు పెట్టారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రోహిత్ శర్మ కుటుంబంతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ సమయంలో, రోహిత్ శర్మ తన సోదరుడు విశాల్‌ను మందలించిన సంఘటన చోటు చేసుకుంది. రోహిత్ తన తమ్ముడిని తిడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

హిట్‌మ్యాన్ సీరియస్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, రోహిత్ శర్మ తన తమ్ముడు విశాల్‌పై మండిపుతున్నట్లు చూడొచ్చు. కారు వైపు వేలు చూపిస్తూ, ఆ డెంట్ ఏంటి అని అడిగాడు. అందుకు విశాల్, రివర్స్ గేర్ తీసేటప్పుడు జరిగిందంటూ బదులిచ్చాడు. దీంతో కోప్పడిన రోహిత్ శర్మ.. నీకు మెదడు లేదా, చూసుకోవాలి కదా అంటూ కోప్పడ్డాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు రోహిత్ శర్మ ప్రవర్తనను సమర్థిస్తుండగా, మరికొందరు అతని సోదరుడిని బహిరంగ ప్రదేశంలో తిట్టి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.

రోహిత్ శర్మ – విశాల్ వీడియో:

ముంబైలో తొలి మ్యాచ్..

రోహిత్ శర్మ పేరు మీద ఉన్న వాంఖడే స్టేడియంలో మే 21న ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. రెండు జట్లు ప్లేఆఫ్ రేసులో ఉన్నందున, ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన ఒత్తిడిలో ఉన్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..