AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రిన్స్ అన్నారు, టీమిండియా ఫ్యూచర్ అంటూ పొగిడేశారు.. కట్‌చేస్తే.. గంభీర్ ఆటలో కీలుబొమ్మలా?

జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గంభీర్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలో యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టాలని భావించాడు. అయితే, గంభీర్ ఆలోచనలను కొందరు సీనియర్ ఆటగాళ్లు వ్యతిరేకించారు. జట్టులో తమ స్థానానికి వచ్చిన ముప్పును పసిగట్టి, రిటైర్మెంట్ ప్రకటించారు.

ప్రిన్స్ అన్నారు, టీమిండియా ఫ్యూచర్ అంటూ పొగిడేశారు.. కట్‌చేస్తే.. గంభీర్ ఆటలో కీలుబొమ్మలా?
Kohli Rohit Gambhir
Venkata Chari
|

Updated on: May 17, 2025 | 12:36 PM

Share

భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీని శుభ్‌మాన్ గిల్‌కు ఇస్తున్నారనే వార్త భారత క్రికెట్‌లో సంచలనం సృష్టించింది. బ్యాట్స్‌మన్‌గా తన ప్రతిభను నిరూపించుకోవడంలో అతను విజయం సాధించినప్పటికీ, అతను మంచి టెస్ట్ కెప్టెన్‌గా ఎదగగలడా లేదా అనేది ప్రశ్నగా మారింది. క్రికెట్‌లోని అత్యంత సుధీర్ఘ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా అతనికి ఇంకా అవకాశం రాలేదు. ఇంతలో, శుభ్‌మాన్ గిల్ కేవలం ఒక తోలుబొమ్మ కెప్టెన్‌గా మాత్రమే ఉంటాడని నిపుణులు వాపోతున్నారు. ఎందుకంటే, జట్టులో సీనియర్ ఆటగాళ్ల ప్రాబల్యం తగ్గుతూ, శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎదుగుతున్న తరుణంలో, కోచ్ గౌతమ్ గంభీర్ జట్టుపై పూర్తి పట్టు సాధించాలని చూస్తున్నాడు. గంభీర్ బలమైన వ్యక్తిత్వం కలిగినవాడు, తన అభిప్రాయాలను సూటిగా చెప్పే మనస్తత్వం కలవాడు. జట్టులో తన మాట నెగ్గాలని కోరుకుంటున్నాడు. గంభీర్ ఆటలో గిల్ ఓ పావులా మారిపోతాడని అంతా భావిస్తున్నారు.

శుభ్‌మాన్ గిల్ ఒక కీలుబొమ్మగా మిగిలిపోతాడా?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత, భారత టెస్ట్ జట్టు మార్పుల దశ కొనసాగుతోంది. ఇటీవల, ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. అదే సమయంలో, టెస్ట్ జట్టు కమాండ్ బాధ్యతలను యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించవచ్చని కొంతకాలంగా నివేదికలు వస్తున్నాయి.

జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యువ ఆటగాడిని కెప్టెన్‌గా చేయాలని పరిశీలిస్తోంది. మే 23న బోర్డు కొత్త కెప్టెన్‌ను ప్రకటించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శుభ్‌మాన్ గిల్‌కు అనుభవం లేదు..

శుభ్‌మాన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌గా నిర్ణయం తీసుకోవడం పట్ల కొంతమంది అభిమానులు అస్సలు సంతోషంగా లేరు. బ్యాట్స్‌మన్‌గా అతను తన సామర్థ్యాన్ని చాలా బాగా నిరూపించుకున్నాడనడంలో సందేహం లేదు. కానీ కెప్టెన్‌గా అతనికి అనుభవం, వ్యూహాత్మక అవగాహన, జట్టులో సమతుల్యతను కాపాడుకునే నైపుణ్యాలు లేవని విమర్శలు గుప్పిస్తున్నారు.

అతనికి ఇంకా టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్‌గా అవకాశం రాలేదు. ఇటువంటి పరిస్థితిలో, అతను జట్టుకు స్వతంత్ర కెప్టెన్ కాలేడని చెబుతున్నారు. జట్టును నడిపించడానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అడుగుపెట్టడం చూడవచ్చు.

గౌతమ్ గంభీర్ ముందు శుభ్‌మాన్ గిల్ తలవంచాల్సి రావొచ్చు..

కొంతకాలం క్రితం గౌతమ్ గంభీర్ భారత జట్టును తన ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల ఎంపిక నుంచి వారి తొలగింపు వరకు అన్ని నిర్ణయాలను అతను స్వయంగా తీసుకోవాలనుకుంటున్నాడు. ప్రధాన కోచ్ పదవిని చేపట్టడానికి ముందే, అతను బీసీసీఐ ముందు కొన్ని షరతులు పెట్టాడు. వాటిని బోర్డు ఆమోదించింది. అయితే, శుభ్‌మాన్ గిల్ కెప్టెన్ అయితే గౌతమ్ గంభీర్‌తో అతని సంబంధం ఎలా ఉంటుందో, ఈ జోడీ ఎలా రాణిస్తుందో చూడటం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..