- Telugu News Sports News Cricket news From Shane Warne to Ravichandran Ashwin and Hardik Pandya these 5 Bowlers Splash As Captains In Ipl History
IPL 2025: ఐపీఎల్ హిస్టరీలోనే వెరైటీ ఈ ఐదుగురు.. ఎందుకో తెలిస్తే, ఫిదా అవ్వాల్సిందే..
ఐపీఎల్ 2025 రెండవ భాగం ఉత్సాహం ఈరోజు అంటే శనివారం ప్రారంభమవుతోంది. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే, మ్యాచ్‌కు ముందు, ఈ లీగ్‌లో కెప్టెన్లుగా సంచలనం సృష్టించిన ఐదుగురు బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 17, 2025 | 1:02 PM

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పట్ల ఉన్న క్రేజ్ చాలా స్పష్టంగా ఉంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. IPL 2025 టోర్నమెంట్ ప్రస్తుతం18వ సీజన్ నడుస్తోంది. ఈ 18 సీజన్లలో, అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని అనేక రికార్డులు నమోదవుతున్నాయి. ఇలాంటి వాటిలో ఒక రికార్డు కెప్టెన్‌గా బౌలింగ్ చేయడం. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు తీసిన టాప్ ఐదు బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఐపీఎల్‌లో షేన్ వార్న్ అద్భుతాలు: తొలి సీజన్‌లో దివంగత ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్‌ను విజయపథంలో నడిపించాడు. కెప్టెన్సీతో పాటు, బౌలింగ్‌లో కూడా వార్న్ తన ప్రతిభను కనబరిచాడు. అందుకే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా అతను మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో షేన్ వార్న్ కెప్టెన్‌గా మొత్తం 57 వికెట్లు పడగొట్టాడు.

2. హార్దిక్ పాండ్యా: ఈ జాబితాలో, షేన్ వార్న్ తర్వాత, హార్దిక్ పాండ్యా పేరు రెండవ స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ముంబైకి ముందు, అతను గుజరాత్ టైటాన్స్‌కు కూడా నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా బౌలింగ్‌లో అతని విజయం గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు అతను మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లలో కూడా హార్దిక్ వికెట్లు తీస్తాడని, ఇది అతని రికార్డును మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

3. పాట్ కమ్మిన్స్: హార్దిక్ పాండ్యా లాగే, ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమ్మిన్స్ కూడా ఐపీఎల్‌లో యాక్టివ్ కెప్టెన్‌గా ఆడుతున్నాడు. పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత సీజన్‌లో కూడా ఫైనల్స్‌కు చేరుకుంది. అదే సమయంలో, బౌలింగ్‌లో కూడా, కమ్మిన్స్ తన జట్టుకు అద్భుతాలు చేస్తాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కమిన్స్ మొత్తం 31 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అతను కెప్టెన్సీలో మరిన్ని వికెట్లు తీస్తాడని భావిస్తున్నారు.

4. అనిల్ కుంబ్లే స్పిన్ మాయాజాలం: భారత మాజీ లెజెండ్ అనిల్ కుంబ్లే కూడా చాలా కాలం పాటు ఐపీఎల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్సీతోనే కాదు, కుంబ్లే తన బౌలింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్ల జాబితాలో కుంబ్లే నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో అతను మొత్తం 30 వికెట్లు పడగొట్టాడు.

5. కెప్టెన్‌గా అశ్విన్ అదుర్స్: భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన బౌలింగ్ తో ఐపీఎల్ లో సంచలనం సృష్టించాడు. అశ్విన్ చాలా కాలం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కెప్టెన్సీతో పాటు బౌలింగ్ లో కూడా అశ్విన్ తన ప్రతిభను చూపించాడు. కెప్టెన్‌గా అశ్విన్ ఐపీఎల్‌లో 25 వికెట్లు పడగొట్టాడు.




