Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs LSG: లక్నో ప్లేయింగ్ 11 నుంచి డేంజరస్ ప్లేయర్ ఔట్.. కారణం హైదరాబాద్ జట్టేనా?

Mitchell Marsh Not In LSG Playing XI Against SRH: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐపీఎల్ 2025 లో తమ రెండవ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ వద్ద లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మైదానంలోని ఆట పరిస్థితులను ఉపయోగించుకోవడానికి తమ జట్టు ఛేజింగ్ చేస్తుందని వెల్లడించాడు.

SRH vs LSG: లక్నో ప్లేయింగ్ 11 నుంచి డేంజరస్ ప్లేయర్ ఔట్.. కారణం హైదరాబాద్ జట్టేనా?
Lsg team
Follow us
Venkata Chari

|

Updated on: Mar 27, 2025 | 8:03 PM

Mitchell Marsh Not In LSG Playing XI Against SRH: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐపీఎల్ 2025 లో తమ రెండవ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ వద్ద లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మైదానంలోని ఆట పరిస్థితులను ఉపయోగించుకోవడానికి తమ జట్టు ఛేజింగ్ చేస్తుందని వెల్లడించాడు.

లక్నో ప్లేయింగ్ 11 నుంచి మిచెల్ మార్ష్ ఔట్..

ఇంతలో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే హై-ఆక్టేన్ మ్యాచ్ కోసం సూపర్ జెయింట్స్ తమ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి మిచెల్ మార్ష్‌ను తొలగించింది.

ఇవి కూడా చదవండి

మార్ష్ వెన్నునొప్పితో బాధపడున్నాడు. దీని కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. అతను తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత, ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో పూర్తిగా బ్యాట్స్‌మన్‌గా ఆడతాడని వెల్లడైంది.

మార్ష్ ప్లేయింగ్ XIలో లేకపోయినా, అతను ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్లలో ఒకడిగా నిలిచాడు. రన్ ఛేజ్ సమయంలో బౌలర్ల ప్లేస్‌లో భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గత మ్యాచ్‌లో మార్ష్ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. 32 బంతుల్లో 6 బౌండరీలు, 6 సిక్సర్లతో సహా 72 పరుగులు చేశాడు. కాబట్టి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కీలక పాత్ర పోషించగలడని తెలుస్తోంది.

SRH vs LSG ప్లేయింగ్ XIలు..

SRH ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్.

LSG ప్లేయింగ్ XI: ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..