IPL 2025: KKRతో మ్యాచ్‌కు ముందు SRH కు భారీ షాక్! నెట్స్ లో గాయపడి గ్రౌండ్ వీడిన నయా హిట్టర్!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్ అనికేత్ వర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడడంతో, అతడి అందుబాటు ప్రశ్నార్థకమైంది. ఈ సీజన్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో SRH ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న అనికేత్ గాయపడితే, జట్టుకు భారీ లోటుగా మారనుంది. SRH మేనేజ్‌మెంట్ త్వరలో అతని స్థితిపై స్పష్టతనివ్వనుంది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) తో మ్యాచ్‌కు ముందు పెద్ద దెబ్బ తగిలింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం జరగనున్న ఈ కీలక మ్యాచ్‌కు ముందు, యువ హిట్టర్ అనికేత్ వర్మ గాయపడిన వార్త అభిమానులను నిరాశకు గురి చేసింది. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అనికేత్ వర్మ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నెట్ బౌలర్ వేసిన బంతి అతని కాలి బొటనవేలికి బలంగా తాకింది. బంతి బలంగా తాకిన వెంటనే అనికేత్ వర్మ నొప్పితో నేలకి పడిపోయాడు. స్థానిక రిపోర్టర్స్ ప్రకారం, అతడు మైదానం విడిచిపెట్టినప్పటి నుంచి తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. అయితే, ఈ గాయం గురించి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ఐపీఎల్ 2025 సీజన్‌తోనే అనికేత్ వర్మ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అయితే, చాలా తక్కువ కాలంలోనే సిక్స్ హిట్టింగ్ సామర్థ్యంతో SRH ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేశాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగిన తొలి మ్యాచ్‌లో, తన తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్‌లో ఐదు సిక్సర్లు బాది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన మ్యాచ్‌లో, 41 బంతుల్లో 74 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.
ఈ సీజన్‌లో అతని అద్భుత ప్రదర్శన వల్లే అనికేత్ వర్మ SRH సెన్సేషన్‌గా మారాడు. అయితే అతను గాయంతో దూరమైతే, సన్‌రైజర్స్ జట్టుకు ఇది పెద్ద కోలుకోలేని దెబ్బ అవుతుంది.
ఒకవేళ అనికేత్ వర్మ గాయం కారణంగా మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే, సచిన్ బెబీ లేదా అథర్వ టైడ్ అతని స్థానంలో జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ గురించి గ్రౌండ్ క్యూరేటర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటూనే స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ కీలక మ్యాచ్‌లో జట్లు వ్యూహాలను ఎలా అమలు చేస్తాయో చూడాలి.
ఇక SRH vs KKR మ్యాచ్‌లో అనికేత్ వర్మ ఆడతాడా లేదా? అనే విషయంలో SRH మేనేజ్‌మెంట్ త్వరలో క్లారిటీ ఇవ్వవచ్చు. అతను ఆడగలిగితే SRH బ్యాటింగ్‌కు పెద్ద బలమైనా, లేనిపక్షంలో జట్టు అతని స్థానాన్ని భర్తీ చేయడంలో కష్టపడే అవకాశం ఉంది.
Aniket Verma got hit on his toe while batting. He didn't bat afterwards.
(Srinjoy Sanyal) pic.twitter.com/iB3auCBkVC
— ORANGE ARMY (@SUNRISERSU) April 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..