WTC ఫైనల్.. సెంచరీతో చెలరేగిన మార్కరమ్! గద ఎత్తేందుకు కొద్ది దూరంలోనే బవుమా..
దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ అద్భుతమైన శతకంతో ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాడు. అతనితో పాటు కెప్టెన్ టెంబా బవుమా అర్ధశతకం సాధించడంతో దక్షిణాఫ్రికా WTC టైటిల్‌ను దాదాపు గెలుచుకుంది. మరో 69 పరుగులు మాత్రమే కావాలి. మార్క్రమ్ (102), బవుమా (65) నాటౌట్‌గా ఉన్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్కరమ్ సెంచరీతో చెలరేగాడు. భీకరమైన ఆస్ట్రేలియన్ పేస్ ఎటాక్‌కు ఎదురొడ్డి నిల్చొని సెంచరీతో కదం తొక్కాడు. అతనికి తోడు ప్రొటీస్ కెప్టెన్ టెంబ బవుమా సైతం హాఫ్ సెంచరీ అదరగొట్టారు. వీరిద్దరి బ్యాటింగ్ దెబ్బకు రెండో డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలనే ఆసీస్ కలపై నీళ్లు పడేలా ఉన్నాయి. ఆల్‌మోస్ట్.. సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుపు ముంగిట్లో నిల్చుంది. మరో 69 పరుగులు చేస్తే చాలు.. సౌతాఫ్రికా చేతుల్లోకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గద వచ్చేస్తోంది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి.. రెండు రోజుల ఆట మిగిలి ఉంది.. క్రీజ్‌లో ఉన్న మార్కరమ్, కెప్టెన్ బవుమా సూపర్‌గా ఆడుతున్నారు.
సో ఏ లెక్కన చూసినా.. మూడో డబ్ల్యూటీసీ వితేజ సౌతాఫ్రికానే అనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచే పరిస్థితి లేదు. కానీ, సౌతాఫ్రికాకు ఉండే దరిద్రం గురించి తెలిసిన చాలా మంది ఇంకా విజయంపై అంత ధీమాగా లేరు. ఆ విషయం అంటుంచితే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 పరుగులు కావాలి. ఎయిడెన్ మార్కరమ్ 159 బంతుల్లో 11 ఫోర్లతో 102 పరుగులు, కెప్టెన్ టెంబ బవుమా 121 బంతుల్లో 5 ఫోర్లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. నాలుగో రోజు వీరిద్దరే మ్యాచ్ ముగిస్తారా? లేదా అన్నది చూడాలి.
👏👏A round of applause for the centurion Aiden Markram at Lord’s 👏👏 pic.twitter.com/cXfWig6p7m
— CricTracker (@Cricketracker) June 13, 2025
MARKRAM – FIRST SOUTH AFRICAN PLAYER TO SCORE A HUNDRED IN ICC FINAL 🤯👑 pic.twitter.com/z8iUecPx5N
— Johns. (@CricCrazyJohns) June 13, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి