AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్నోతో మ్యాచ్‌కు ముందు ముంబైకి బిగ్ షాక్.. ఫిట్‌గా మారిన టీమిండియా ఫ్యూచర్ బుమ్రా.. హార్దిక్‌ ఖాతాలో మరో ఓటమి?

Mayank Yadav: ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు ముందు సోమవారం జరిగిన అన్ని ఫిట్‌నెస్ పరీక్షల్లో మయాంక్ ఉత్తీర్ణుడయ్యాడని LSG బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ధృవీకరించారు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా ఆటగాడు తన జట్టు నుంచి మెరుగైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఓటమి తర్వాత చర్చనీయాంశమైన విషయం ఏమిటంటే, రవి బిష్ణోయ్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయడమేనని చెబుతున్నాడు.

లక్నోతో మ్యాచ్‌కు ముందు ముంబైకి బిగ్ షాక్.. ఫిట్‌గా మారిన టీమిండియా ఫ్యూచర్ బుమ్రా.. హార్దిక్‌ ఖాతాలో మరో ఓటమి?
Mayank Yadav Injury
Venkata Chari
|

Updated on: Apr 30, 2024 | 1:43 PM

Share

IPL 2024, LSG vs MI: మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ జట్టులో ఉంటాడని లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధృవీకరించారు. దీంతో ఇప్పటికే వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దూరంగా వెళ్తోన్న ముంబై జట్టుకు.. ఇది పిడుగులాంటి వార్తే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కారణం, మయాంక్ అగర్వాల్ ఇప్పటికే తన పదునైన బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే, గాయం కారణంగా గత మ్యాచ్‌ల్లో ఆడలేదు. ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించి, రీఎంట్రీకి సిద్ధమయ్యాడని ఫ్రాంచైజీ పేర్కొంది.

“మయాంక్ ఫిట్‌గా ఉన్నాడు. అతను తన ఫిట్‌నెస్ పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణుడయ్యాడు. అతను తిరిగి జట్టులోకి రావడానికి మేం సంతోషిస్తున్నాం. రేపటికి 12 మంది సంభావ్యతను కలిగి ఉన్నాం”అంటూ మోర్కెల్ వెల్లడించాడు.

శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా ఆటగాడు తన జట్టు నుంచి మెరుగైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఓటమి తర్వాత చర్చనీయాంశమైన విషయం ఏమిటంటే, రవి బిష్ణోయ్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయడమేనని చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

“వ్యూహాత్మకంగా, కొన్నిసార్లు ఓ నిర్ణయం మమ్మల్ని నిరాశపరుస్తుంది. దాని నుంచి పాఠాలు తీసుకోవాలి. బ్యాటర్లకు వ్యతిరేకంగా బిష్ణోయ్ కోసం ఒక నిర్దిష్ట గేమ్ ప్లాన్ ఉంది. దురదృష్టవశాత్తు, ఆ కుర్రాళ్లకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కెప్టెన్సీ దృక్కోణంలో, మేం అతనిని వెనక్కి తీసుకున్నాం. మేం తప్పు చేశాం” అని మోర్కెల్ అన్నాడు.

“మొత్తం 24 బంతుల్లో ఒత్తిడికి గురయ్యాం. అయితే, బ్యాటర్లు ఆడుతున్న తీరును బట్టి వికెట్లు తీయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మేం నిజాయితీగా ఉంటే, బహుశా ఆట మారవచ్చు. బౌలర్‌పై అంచనాలు కూడా మారాలి’ అంటూ తప్పులను గుర్తుచేసుకున్నాడు.

లక్నో ప్రస్తుతం స్టాండింగ్స్‌లో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ స్థానం కోసం పోటీలో ఉంది. అయితే, ముంబయి ఇండియన్స్ ముందుకు సాగాలంటే మిగిలిన మ్యాచ్‌లు గెలవాలి. మొదటి నాలుగు స్థానాలను ఛేదించేందుకు తమ జట్టు తనకు తానుగా మద్దతు ఇచ్చిందని ఆఫ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ చెప్పాడు.

“మాకు ఒత్తిడి లేదు. ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. గత సంవత్సరం, మేం అర్హత సాధించడానికి చివరికి చాలా గేమ్‌లను గెలవవలసి వచ్చింది. మేం దానిని పూర్తి చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా సాధించగలమని చాలా సానుకూలంగా ఉన్నాం. క్రికెట్‌లో ఎత్తుపల్లాలు ఒక భాగం. ఎలా మెరుగుపడాలనే దానిపైనే దృష్టి సారిస్తున్నాం’ అంటూ కార్తికేయ తెలిపాడు.

IPL 2024 48వ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI ఇదే..

లక్నో సూపర్ జెయింట్స్:

క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

ముంబై ఇండియన్స్:

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..