IPL 2024: వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్ దేవుడయ్యాడుగా.!

ఐపీఎల్ 2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా..

IPL 2024: వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్ దేవుడయ్యాడుగా.!
Kkr Vs Rcb
Follow us

|

Updated on: Apr 30, 2024 | 1:55 PM

ఐపీఎల్ 2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టార్గెట్ చేజ్ చేసే క్రమంలో కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు సాల్ట్. నిజానికి ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఈ ఇంగ్లాండ్ బ్యాటర్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపించలేదు.

ఆ తర్వాత కేకేఆర్ అదృష్టమో.. లేక మిగిలిన జట్ల దురదృష్టమో తెలియదు గానీ.. ఆ జట్టు బ్యాటర్ జాసన్ రాయ్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో.. గంభీర్ సీన్‌లోకి వచ్చి ఫిలిప్ సాల్ట్‌ను తీసుకున్నాడు. ఇక ఆ నిర్ణయమే కోల్‌కతాకు కలిసొచ్చింది. సునీల్ నరైన్‌తో కలిసి ఫిలిప్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ కలిసి కేకేఆర్ పవర్‌ప్లే‌లో ప్రత్యర్ధులను భయపెడుతూ పరుగులు రాబట్టారు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన సాల్ట్‌ 49.00 యావరేజ్‌‌తో 392 పరుగులు చేశాడు. అలాగే 180.65 స్ట్రైక్‌రేట్‌తో 4 హాఫ్‌ సెంచరీలు బాదేశాడు. ఒక్క బ్యాటర్‌గా మాత్రమే కాదు.. వికెట్ కీపర్‌గానూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వచ్చే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలోనూ ఫిలిప్ సాల్ట్ ఇదే ఆటతీరు కనబరుస్తాడని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది.

Latest Articles