IND vs AUS: అరే ఏందయ్యా భరత్‌.. సింపుల్‌ క్యాచ్‌ను అలా వదిలేశావ్‌.. రోహిత్ రియాక్షన్‌ ఏంటో చూశారా?

తమ కెప్టెన్‌ నిర్ణయం సరేనని నిరూపిస్తూ ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (32), ఉస్మాన్‌ ఖవాజా నిలకడగా ఆడారు. మొదటి వికెట్‌కు 61 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే హెడ్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్‌ కేఎస్‌ భరత్ నేలపాటు చేశాడు.

IND vs AUS: అరే ఏందయ్యా భరత్‌.. సింపుల్‌ క్యాచ్‌ను అలా వదిలేశావ్‌.. రోహిత్ రియాక్షన్‌ ఏంటో చూశారా?
Ks Bharat
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2023 | 1:02 PM

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు భారత్‌ ,ఆస్ట్రేలియా ప్రధానులు మైదానంలో సందడి చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. తమ కెప్టెన్‌ నిర్ణయం సరేనని నిరూపిస్తూ ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (32), ఉస్మాన్‌ ఖవాజా నిలకడగా ఆడారు. మొదటి వికెట్‌కు 61 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే హెడ్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్‌ కేఎస్‌ భరత్ నేలపాటు చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ వేసిన ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని హెడ్‌ ఆఫ్‌ సైడ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. అయితే సునాయాస క్యాచ్‌ను అందుకోవడంలో తెలుగు ఆటగాడు విఫలమయయ్యాడు. దీంతో భారత జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అయితే.. భరత్‌ను ఏం అనకుండా చాలా సైలెంట్‌గా ఉండిపోయాడు.

మరోవైపు భరత్‌ క్యాచ్‌ వదిలేయడంపై క్రికెట్‌ అభిమానులు కూడా మండిపడుతున్నారు. భరత్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను తీసుకున్నా బాగుండేదని సూచిస్తున్నారు. అయితే 32 పరుగులు చేసిన హెడ్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో జడేజాకు దొరికిపోయాడు. కాగా తొలి మూడు టెస్టుల్లో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు భరత్‌. అయితే వికెట్‌ కీపర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. కీలకమైన నాలుగో టెస్టులో కేఎస్‌ భరత్‌పై వేటు పడుతుందని చాలామంది అనుకున్నారు. అయితే టీమ్‌ మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, భరత్‌కు మద్దతుగా నిలిచారు. నాలుగో టెస్టులోనూ భరత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..