టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిల వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఖండాలలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో వివాహ వేడుక జరిగింది. ఈ వివాహా వేడుకకు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మీడియాతో మాట్లాడిన సునీల్ శెట్టి తమ కూతురు వివాహం వైభవంగా జరిగినట్లు తెలిపారు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి కొందరు మీడియా ప్రతినిధులకు స్వీట్లు పంచారు. వివాహ వేదిక స్థలానికి మీడియాను అనుమతించలేదు. అయితే వివాహ వేడుక బయట మీడియాతో ముచ్చటించిన సునీల్ శెట్టి మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలపడంతో పాటు స్వీట్లు పంచారు. పెళ్లి అధికారికంగా జరిగిపోయింది కాబట్టి తాను అధికారికంగా మామయ్యను అయిపోయానని సునీల్ శెట్టి చెప్పుకొచ్చారు. అయితే కొత్త జంట మాత్రం మీడియా ముందుకు రాలేదు.
Sunil Shetty confirms that KL & Athiya are officially married now. Distributes sweets to media and informs about reception post-IPL. #KLRahulAthiyaShettyWedding #IPL2023 pic.twitter.com/IjUs09HqRn
— Himanshu Pareek (@Sports_Himanshu) January 23, 2023
ఇదిలా ఉంటే వివాహం జరిగిన కాసేపటికే కొత్త పెళ్లి కూతురు అతియా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. రాహుల్‌తో ఏడడుగులు వేసిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను పంచుకున్న అతియా.. ‘నీ సాన్నిహిత్యంలోనే ఎలా ప్రేమించాలో తెలుసుకున్నాను. ఈరోజు నేను ఎంతగానే ఇష్టపడే వ్యక్తితో నా వివాహం జరిగింది. ఇది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..