క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నాడు.. తల్లి చెప్పిన ఆ ఒక్క మాట.. కట్ చేస్తే.. 15 ఫోర్లు, 11 సిక్సర్లతో వీరవిహారం

కొడుకు ఏదైనా గొప్ప ఘనత సాధిస్తే.. దాన్ని చూసి ఏ తల్లైనా కచ్చితంగా సంతోషంతో మురిసిపోతుంది. ఈ తల్లి ఆ కొడుకును పెంచి పెద్దవాడిని చేసింది.

క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నాడు.. తల్లి చెప్పిన ఆ ఒక్క మాట.. కట్ చేస్తే.. 15 ఫోర్లు, 11 సిక్సర్లతో వీరవిహారం
Cricket
Follow us

|

Updated on: Jan 23, 2023 | 6:20 PM

కొడుకు ఏదైనా గొప్ప ఘనత సాధిస్తే.. దాన్ని చూసి ఏ తల్లైనా కచ్చితంగా సంతోషంతో మురిసిపోతుంది. ఈ తల్లి ఆ కొడుకును పెంచి పెద్దవాడిని చేసింది. తనకు నచ్చిన దారిలో వెళ్లమని దగ్గరుండి ప్రోత్సహించింది. కట్ చేస్తే ఆ కుమారుడు చేసిన పనికి ఇప్పుడు తెగ సంతోషపడిపోతోంది. ఇంతకీ అతడెవరో కాదు అథర్వ అంకోలేకర్. సీకే నాయుడు ట్రోఫీలో ముంబైకి సారధ్యం వహిస్తున్న అథర్వ అంకోలేకర్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అథర్వ 15 ఫోర్లు, 11 సిక్సర్లతో 211 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.

మరోవైపు 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో అథర్వ బంతితో విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి భారత్‌ను 7వ సారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అథర్వ బంతితో అదరగొడుతున్న సమయంలో అతడి తల్లి, గ్రౌండ్‌లో కాకుండా తన ఉద్యోగంలో నిమగ్నమై ఉన్నారు. కొలీగ్స్ ద్వారా తన కొడుకు ఘనతను తెలుసుకుని సంబరపడ్డారు. అథర్వ తండ్రి 2010లో చనిపోయాడు. దీంతో భర్త కండక్టర్ ఉద్యోగాన్ని భార్య వైదేహి పొందింది. కాగా, ఒకానొక సమయంలో తన ఆర్ధిక పరిస్థితి కారణంగా అథర్వ క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నాడు. అయితే తల్లి ప్రోత్సాహంతో ప్రతీ రోజూ 15 కి.మీ బస్సులో ప్రయాణించి క్రికెట్ ప్రాక్టీస్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈరోజు గొప్ప ఘనతలు సాధిస్తున్నాడు.