టీ20 వరల్డ్‌కప్‌కు పక్కనపెట్టారు.. కట్ చేస్తే.. 18 ఫోర్లు, 24 సిక్సర్లు బాదేసిన ధోని టీమ్‌మేట్..

బిగ్‌బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలోకి దిగిన స్మిత్..

టీ20 వరల్డ్‌కప్‌కు పక్కనపెట్టారు.. కట్ చేస్తే.. 18 ఫోర్లు, 24 సిక్సర్లు బాదేసిన ధోని టీమ్‌మేట్..
Smith And Dhoni
Follow us

|

Updated on: Jan 23, 2023 | 8:24 PM

బిగ్‌బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలోకి దిగిన స్మిత్.. వరుసగా రెండు సెంచరీలు, ఓ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో మూడో మ్యాచ్ ఆడుతోన్న స్మిత్ 66 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 200 స్ట్రైక్ రేట్‌తో 6 సిక్సర్లు, 4 ఫోర్లు బాదేశాడు. అంటే స్మిత్ బౌండరీల రూపంలో 10 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు.

మొదటి రెండు మ్యాచ్‌ల్లో రెండు శతకాలు బాదేసిన స్మిత్.. మూడో మ్యాచ్‌లోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. హోబర్ట్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో తన జట్టు సిడ్నీ సిక్సర్లకు మంచి ప్రారంభాన్ని అందించాడు. స్మిత్ క్రీజులోకి రాగానే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే తను ఎదుర్కున్న మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. కేవలం 22 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

3 మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు..

టెస్ట్ స్పెషలిస్ట్ స్టీవ్ స్మిత్‌.. ఇప్పటిదాకా టీ20ల్లో అద్భుతమైన ఫామ్ కొనసాగించింది తక్కువే. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టేలా చేశాడు. గత మూడు టీ20 మ్యాచ్‌ల్లో స్మిత్ ఏకంగా 24 సిక్సర్లు కొట్టాడు. అందులో సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్మిత్ 6 సిక్సర్లు బాదాడు. అంతకుముందు సిడ్నీ థండర్స్‌పై 9 సిక్సర్లు, అడిలైడ్ స్ట్రైకర్స్‌పై స్మిత్ 7 సిక్సర్లు బాదేశాడు.

మారిన స్మిత్ ఆటతీరు.?

స్టీవ్ స్మిత్ తన ఆటలో ఒకే ఒక్క మార్పు చేశాడు. తన మైండ్ సెట్ మార్చుకుని క్రీజులోకి వచ్చీ రాగానే భారీ షాట్లు ఆడుతున్నాడు. అలాగే తన బలమైన లెగ్ సైడ్‌లో చాలానే సిక్సర్లు బాదాడు. అటు తన బ్యాటింగ్ టెక్నిక్‌ను సైతం స్మిత్ మార్చుకున్నాడు. అందువల్ల లాంగ్ సిక్సర్లు కొట్టడంలో స్మిత్ సఫలం అవుతున్నాడు.