ఒకే ఓవర్‌లో 31 పరుగులు.. 35 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. 5 గురి బౌలర్ల ఊచకోత! ఆ ప్లేయర్ ఎవరంటే?
2,4,4,2,7,6,6... ఇది ఒక ఓవర్‌లో బ్యాటర్ కొట్టిన స్కోర్. ఆ ఆటగాడి కెరీర్ దాదాపుగా ముగిసిందని అందరూ అనుకున్నారు..

2,4,4,2,7,6,6… ఇది ఒక ఓవర్‌లో బ్యాటర్ కొట్టిన స్కోర్. ఆ ఆటగాడి కెరీర్ దాదాపుగా ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ఆరోన్ ఫించ్.. తన సహచర ఆటగాడు ఆండ్రూ టై బౌలింగ్‌లో చితక్కొట్టాడు. అయితేనేం చివరికి తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ లీగ్‌లోని 52వ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ బౌలర్లను భీకరంగా చిత్తు చేశాడు ఆరోన్ ఫించ్. ఆండ్రూ టై వేసిన ఒక ఓవర్‌లో 31 పరుగులు రాబట్టాడు. తద్వారా లీగ్‌లో అత్యదిక పరుగులు సమర్పించిన ఓవర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.
ఈ ఒక్క ఓవర్‌లో ఫించ్ 31 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత ఓవర్ మొదటి బంతికి సదర్లాండ్‌కు క్యాచ్ ఇచ్చి ఫించ్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కున్న అతడు 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 76 పరుగులు చేశాడు. ఇంతటి తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఫించ్ ఆడినప్పటికీ.. తన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. మెల్‌బోర్న్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఈ మ్యాచ్‌లో పెర్త్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా, ఫించ్ గతేడాది వన్డే క్రికెట్‌కు రిటైరయ్యాడు. అతడి నాయకత్వంలోనే ఆస్ట్రేలియా T20 ప్రపంచకప్‌లో సాధించిన విషయం తెలిసిందే.
View this post on Instagram