IPL 2023: పరీక్షల్లో కాపీ కొట్టి చావు దెబ్బలు.. కట్ చేస్తే ఐపీఎల్‌లో 8 కోట్లు.. ఈ ప్లేయర్ సుడి మామూలుగా లేదుగా

సాధారణంగా ఇంట్లో టీచర్‌ ఉంటే పిల్లలు బాగా చదువుతారు. క్రమశిక్షణతో బుద్ధిమంతులుగా మెలుగుతారు. అయితే ఇతను మాత్రం కొంచెం భిన్నం. ఇంట్లో టీచర్‌ను పెట్టుకుని మరీ పరీక్షల్లో కాపీ కొట్టాడు. పోని అదైనా సక్సెస్‌ అయ్యాడా అంటే అదీలేదు. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

IPL 2023: పరీక్షల్లో కాపీ కొట్టి చావు దెబ్బలు.. కట్ చేస్తే ఐపీఎల్‌లో 8 కోట్లు.. ఈ ప్లేయర్ సుడి మామూలుగా లేదుగా
Kolkata Knight Riders
Follow us
Basha Shek

|

Updated on: Apr 20, 2023 | 12:29 PM

సాధారణంగా ఇంట్లో టీచర్‌ ఉంటే పిల్లలు బాగా చదువుతారు. క్రమశిక్షణతో బుద్ధిమంతులుగా మెలుగుతారు. అయితే ఇతను మాత్రం కొంచెం భిన్నం. ఇంట్లో టీచర్‌ను పెట్టుకుని మరీ పరీక్షల్లో కాపీ కొట్టాడు. పోని అదైనా సక్సెస్‌ అయ్యాడా అంటే అదీలేదు. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. కుమారుడిని అర్థం చేసుకున్నాడేమో తండ్రి ఒక్కమాట కూడా అనలేదు. కానీ తల్లి మాత్రం దెబ్బలు వాయించింది. అలా అమ్మ చేతిలో దెబ్బలు తిన్న కుమారుడు ఇప్పుడు ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. రూ. 8 కోట్ల ధరతో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతను మరెవరో కాదు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథి నితీశ్‌ రాణా. ఆటగాడిగా, నాయకుడిగా కేకేఆర్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న రాణా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇందులో భాగంగానే పైన చెప్పిన ఫన్నీ ఇన్నిడెంట్‌ను అందరితో పంచుకున్నాడు.

గత కొన్ని సీజన్లుగా కోల్‌కతాకు రెగ్యులర్‌ ప్లేయర్‌గా మారిపోయాడు నితీశ్‌. ఈ క్రమంలోనే గాయంతో బాధపడుతోన్న రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కేకేఆర్‌ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో కెప్టెన్‌గా అనుభవమున్న అతను ఈ సీజన్‌లోనూ అంచనాల మేర రాణిస్తున్నాడు. అతని సారథ్యంలో ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన కోల్‌కతా రెండింటిలో గెలిచింది. ప్రస్తుత ఆ జట్టు 4 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక బ్యాటర్‌గా 5 మ్యాచుల్లో 150 పరుగులు చేశాడు రాణా. ఇవాళ కోల్‌కతా జట్టు వరుసగా 5 ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..