- Telugu News Photo Gallery Cricket photos List of Top 5 Team India Bowlers who Conceded Most Sixes in IPL 2023 till now
IPL 2023: ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్లు వీరే.. లిస్టులో జడేజా, అశ్విన్ కూడా..
IPL 2023: ఐపీఎల్ మ్యాచ్‌లో సిక్సర్లు అంటే అభిమానులకు పూనకాలే. అభిమానుల ముందు సిక్సర్లు బాదిన బ్యాటర్లు. ఆల్‌రౌండర్లు, బౌలర్లు చాలా మందే ఉన్నారు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్లు కూడా ఉన్నారు.
Updated on: Apr 20, 2023 | 3:34 PM

ఐపీఎల్ 2023: 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటివరకు 15 సీజన్లు పూర్తి చేసుకుంది. అలాగే ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్‌లో కూడా దాదాపు 25 మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ఇక ఐపీఎల్ అంటే పరుగుల వర్షం.. సిక్సర్ల మోత. ఇప్పటివరకు జరిగిన 15 సీజన్ల ఐపీఎల్ మ్యాచ్‌లలో బ్యాటర్లే కాక బౌలర్లు కూడా తమ బ్యాట్‌తో రికార్డులు సృష్టించారు.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో గేల్ 357 సిక్సర్లు ఈ ఘనతను అందుకున్నాడు. మరి ఏ బౌలర్ల బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు నమోదయ్యాయో మీకు తెలుసా...? ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో టాప్ 5 ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం..

1. పీయూష్ చావ్లా: ఐపీఎల్‌లో 169 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన పీయూష్ చావ్లా మొత్తం 185 సిక్సర్లు ఇచ్చుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో చావ్లా అగ్రస్థానంలో ఉన్నాడు.

2. యుజ్వేంద్ర చాహల్: ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు ఇచ్చుకున్న టీమిండియా బౌలర్ల జాబితాలో చాహల్ రెండో స్థానంలో ఉన్నాడు. యుజ్వేంద్ర చాహల్ 135 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్సర్లు ఇచ్చుకున్నాడు.

3. రవీంద్ర జడేజా: ఈ జాబితాలో జడేజా మూడవ స్థానంలో ఉన్నాడు. 186 ఇన్నింగ్స్‌లలో 180 సిక్సర్లు ఇచ్చుకోవడం ద్వారా జడేజా ఈ లిస్టులో స్థానం పొందాడు.

4. అమిత్ మిశ్రా: ఐపీఎల్‌లో 156 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన అమిత్ మిశ్రా కూడా 176 సిక్సర్లు సమర్పించుకున్నాడు.

5. రవిచంద్రన్ అశ్విన్: అశ్విన్ 186 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 173 సిక్సర్లు ఇచ్చాడు.




