- Telugu News Photo Gallery Cricket photos List Of Records Broke In RCB Vs CSK Match, MS Dhoni, Virat Kohli, Here are details
IPL 2023: గురు శిష్యుల ఊచకోత.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్.. ఈ సీజన్‌లో ఆ మ్యాచే హైలైట్.!
చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితేనేం.. ఈ గురు శిష్యుల పోరాటంలో పలు రికార్డులు బద్దలయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందామా..
Updated on: Apr 20, 2023 | 4:57 PM

హయ్యస్ట్ స్కోర్: ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చేసిన మొత్తం పరుగులు 444. చిన్నస్వామి స్టేడియంలో ఇదే అత్యధిక స్కోరు. దీనికి ముందు, RCB, లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 425 పరుగులు నమోదయ్యాయి

సీఎస్‌కే అత్యధిక స్కోరు: ఈ మ్యాచ్‌లో CSK సాధించిన మొత్తం ఐపీఎల్ చరిత్రలోని మూడో అత్యధిక స్కోరు. మొదటిది 2010లో రాజస్థాన్ రాయల్స్‌పై 246 పరుగులు. 2008లో కింగ్స్ XI పంజాబ్‌పై 240 పరుగులు. ఇప్పుడు 226 పరుగులు మూడోది.

ఆర్సీబీపై చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక స్కోర్ ఈ 226 పరుగులే. అలాగే చెన్నైపై 218 పరుగులు ఆర్సీబీ అత్యధిక స్కోర్.

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్లు మొత్తం 17 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే. 2018, 2022లో కూడా CSK బ్యాటర్లు 17 సిక్సర్లు బాదేశారు. ఇప్పుడు ఆ పాత రికార్డునే రిపీట్ చేశారు.

ఆర్సీబీ-సీఎస్కే కలిపి ఈ మ్యాచ్‌లో 33 సిక్సర్లు బాదేశారు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల ఉమ్మడి రికార్డు ఇదే. 2018లో బెంగళూరులో జరిగిన RCB vs CSK, 2020లో షార్జాలో RR vs CSK మ్యాచ్‌లలోనూ 33 సిక్సర్లు నమోదయ్యాయి.




