IPL 2023: బిల్డప్ బాబాయ్.. 6 మ్యాచుల్లో 54 రన్స్‌.. ట్రోలర్స్‌కు టార్గెట్‌గా మారిన 3.8 కోట్ల ప్లేయర్‌

ఇక 'ఆట తక్కువ.. ఆటిట్యూడ్‌ ఎక్కువ' అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న రియాన్‌ పరాగ్‌ 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో మరోసారి ట్రోలర్లకు టార్గెట్‌గా మారిపోయాడు. రాబిన్‌ ఊతప్ప, రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు కూడా రియన్‌ ఆటతీరు మార్చుకోవాలంటూ సలహాలిస్తున్నారు.

IPL 2023: బిల్డప్ బాబాయ్.. 6 మ్యాచుల్లో 54 రన్స్‌.. ట్రోలర్స్‌కు టార్గెట్‌గా మారిన 3.8 కోట్ల ప్లేయర్‌
Riyan Parag
Follow us
Basha Shek

|

Updated on: Apr 20, 2023 | 11:14 AM

యశస్వి, జోస్‌ బట్లర్‌, సంజూశామ్సన్‌, హెట్మయిర్‌, పడికల్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్ జురేల్‌.. ఇలా అదరగొట్టే బ్యాటర్ల ఉన్నప్పటికీ 155 పరుగులను ఛేదించలేకపోయింది రాజస్థాన్‌. వీరి తర్వాత రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేయగలిగే సత్తా ఉంది. అయినా రాజస్థాన్‌ సొంత మైదానంలో ఓటమిపాలైంది. జైపూర్‌లో నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగడం గమనార్హం. అయితే సొంత ప్రేక్షకుల మధ్య గుజరాత్‌ చేతిలో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది సంజూ టీం. 155 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌ ( 35 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (41 బంతుల్లో 40) మినహా మరెవరూ పెద్దగా రాణించలేదు. అందరూ అలా వచ్చి ఇలా వెనుదిరిగారు. ఇక ‘ఆట తక్కువ.. ఆటిట్యూడ్‌ ఎక్కువ’ అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న రియాన్‌ పరాగ్‌ 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో మరోసారి ట్రోలర్లకు టార్గెట్‌గా మారిపోయాడు. రాబిన్‌ ఊతప్ప, రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు కూడా రియన్‌ ఆటతీరు మార్చుకోవాలంటూ సలహాలిస్తున్నారు.

కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు పరాగ్ 6 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం 54 పరుగులు మాత్రమే చేయగలిగాడు. లక్నోపై 12 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు 5 మ్యాచ్‌లలో అతని స్కోర్లు 15, 5, 7, 20, 7 మాత్రమే. దీంతో పరాగ్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2019 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రియాన్ పరాగ్.. తన కెరీర్ లో ఇప్పటి వరకు 51 మ్యాచ్ లు ఆడి 561 పరుగులు చేశాడు. కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. ఇక గతేడాది జరిగిన ఐపీఎల్ సందర్భంగా పరాగ్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. అందుకే ఇతడిని బిల్డప్ బాబాయ్ అంటూ నెట్టింట ట్రోల్స్‌ వస్తున్నాయి. జట్టులో అనవసరంగా ఉంచుతున్నారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??
కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??
రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..
రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..