AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు.. కోహ్లీ, ధోనీ, రోహిత్‌లకు సాధ్యం కాని లిస్ట్‌లో ముగ్గురు ఎంట్రీ.!

IPL Final Player of the Match: క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ అంటేనే రికార్డుల నిలయం. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఒక ప్రత్యేక రికార్డును ముగ్గురు భారత ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయకముందే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకుని వీరు చరిత్ర సృష్టించడం విశేషం.

ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు.. కోహ్లీ, ధోనీ, రోహిత్‌లకు సాధ్యం కాని లిస్ట్‌లో ముగ్గురు ఎంట్రీ.!
Ipl Records
Venkata Chari
|

Updated on: Mar 25, 2026 | 1:01 PM

Share

IPL Final Player of the Match: భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న ఐపీఎల్ ప్రతి ఏటా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. కానీ, జట్టును విజేతగా నిలిపి, ఫైనల్ పోరులో అత్యుత్తమ ఆటగాడిగా నిలవడం అనేది ఒక ఎత్తు అయితే, దేశం తరపున ఆడకముందే ఆ ఘనత సాధించడం మరో ఎత్తు. ఎంఎస్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారు కూడా ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కేవలం ముగ్గురు క్రికెటర్లు మాత్రమే ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.

1. మన్విందర్ బిస్లా (2012): ఈ జాబితాలో మొదటి పేరు మన్విందర్ బిస్లా. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ఇతను 2012 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఇంతటి గొప్ప ప్రదర్శన చేసినా బిస్లా ఎప్పుడూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు.

2. మనీష్ పాండే (2014): మరోసారి కోల్‌కతా జట్టు తరపున ఆడుతూ మనీష్ పాండే ఈ ఘనత సాధించాడు. 2014 ఫైనల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 94 పరుగులు చేసి జట్టుకు రెండోసారి టైటిల్‌ను అందించాడు. అప్పటికి అతను టీమ్ ఇండియాలో అడుగుపెట్టలేదు. ఆ ప్రదర్శన తర్వాత ఏడాదికి 2015లో అతను భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.

3. కృనాల్ పాండ్యా (2017): ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ఈ జాబితాలో మూడో ఆటగాడు. 2017 ఫైనల్ మ్యాచ్‌లో ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడు అతను అరంగేట్రం చేయని ఆటగాడిగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత సుమారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత అంటే 2018లో భారత జట్టులోకి ఎంపికయ్యాడు. తాజాగా 2025 సీజన్‌లో కూడా అతను అద్భుత ప్రదర్శన చేయడం గమనార్హం. రానున్న 2026 సీజన్‌లో నాలుగో ఆటగాడిగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us